Friday, May 3, 2024
- Advertisement -

కేసులున్న జగన్ పాటి ధైర్యం మనకు లేకుండా ఎందుకు పోయిందిః బాబుతో జేసీ, ఎంపిలు

- Advertisement -

సోనియాను ఎదిరించబట్టే వైఎస్ జగన్‌పై కేసులు ఉన్నాయని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడే ఒప్పుకున్నాడు. ఆ విషయం పక్కనపెడితే మొన్నటి వరకూ కూడా కేసుల భయంతోనే వైఎస్ జగన్ మోడీకి భయపడుతున్నాడు అని గట్టిగా ప్రచారం చేశారు బాబు అండ్ బ్యాచ్. అయితే జగన్ ధైర్యం ఏంటో…..ఎందుకు తెగించాడో తెలియదు కానీ ఎంపిల రాజీనామాలతో పాటు పవన్ ఛాలెంజ్‌ని స్వీకరించి అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అన్నాడు. స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కోసం తాను చేయాలనుకున్నపోరాటానికి సంబంధించి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాడు. ఎక్కడా నాన్చడాలు……మీడియా లీకులతో డ్రామాలు….నాలుగేళ్ళ తర్వాత కూడా ఇంకా అధ్యయనం చేస్తాం….ఆలోచిస్తాం లాంటి చేతకాని చవట కబుర్లు కూడా చెప్పలేదు. సోనియాను ఎదిరించినట్టే మోడీపై కూడా పోరాటానికి దిగాడు.

ఇదే విషయం టిడిపి ఎంపిలతో బాబు సమావేశంలో చర్చకు వచ్చింది. అసలు జగన్ ధైర్యమేంటి? మోడీకి వ్యతిరేకంగా వెళ్ళడానికి అధికారంలో ఉన్న నాయకులే సంకోచిస్తూ ఉంటే జగన్ రెచ్చిపోవడానికి కారణం ఏంటి అని ఎంపిలు మాట్లాడుకున్నారు. వైఎస్‌ల వ్యక్తిత్వమే అంత అని…….నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అయినా…ఇప్పుడు జగన్ అయినా మొండి ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని ముందుకు పోయే నైజం వాళ్ళదని టిడిపి ఎంపిలు చర్చించుకున్నారు. అదే సందర్భంలోనే కేసులు ఉన్న జగన్, అధికారంలో లేని జగనే మోడీకి వ్యతిరేకంగా రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం లాంటి నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా నిలబడితే మనం మాత్రం ఉత్త మాటలు చెప్తూ…జగన్‌పై విమర్శలు చేస్తూ రాజకీయ డ్రామాలు నడిపిస్తా ఉంటే ప్రజలు మనల్ని నమ్మరని జేసీలాంటి వాళ్ళు చంద్రబాబు మొహం మీదే మాట్లాడేశారు. అలాగే కేసులున్న జగన్‌కి లేని భయం మనకు ఎందుకని? చివరి సంవత్సరంలో కూడా మోడీకి భయపడుతూ మీడియా లీకులతో పోరాటం డ్రామాలు, కోర్టుకు వెళతాం లాంటి చేతకాని మాటలు మాట్లాడితే ప్రజలు మనల్ని చేతకాని వాళ్ళలాగే చూస్తారని అభిప్రాయపడ్డారు. మంత్రుల చేత రాజీనామాలు, ఎంపిలతో రాజీనామాలు……ఇలా ఏదో ఒక్క గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నామని చంద్రబాబుని ప్రశ్నించారు.

అయితే బాబు మాత్రం ఎంపిల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇష్టపడలేదు. నలభై రాజకీయ అనుభవం ఉందినాకు….ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. జగన్‌లాగే మొండిగా నిర్ణయాలు తీసుకుని ఉంటే ఇంతకాలం అధికారంలో ఉండేవాడినా? ముందు నన్ను ప్రశ్నించడం మానేసి జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు నమ్మకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండని ఎంపిలకు హెచ్చరిక చేశాడు. రాజకీయాల్లో ఎంత చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదని……ప్రజలను ఎలా నమ్మించగలుగుతున్నాం అన్నదే ముఖ్యమని…..ఆ ప్రయత్నంలో విజయవంతమైతే 2019లో కూడా అధికారం మనకే సొంతమవుతుందని చెప్పి ఎంపిలకు హితబోధ చేశాడు చంద్రబాబు. 2014ఎన్నికల్లో విభజనకు పూర్తిగా సహకరించిన బిజెపితో…. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఉత్త మాటలు వద్దు… దమ్ముంటే విభజన చేసి చూపండి…తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చూపండి అని సవాల్ చేసిన మనం పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించలేదా? సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన జగన్‌ని ఓడించలేదా? నలభై ఏళ్ళ అనుభవంలో ఇలాంటివి చాలా చూశానని….జగన్ కంటే ఎక్కువగా మనమే పోరాటం చేస్తున్నామని…జగన్‌ది దొంగ పోరాటం అని ప్రజల్లోకి బలంగా పోయేలా ప్రచారం చేయండని ఎంపిలకు గట్టిగా చెప్పాడు చంద్రబాబు. బాబు చెప్పిన సూత్రం ప్రకారం అయితే మాత్రం 2019లోకూడా టిడిపినే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రజలకు ఈ రాజకీయ డ్రామాలు అర్థమైతే మాత్రం 2014కాంగ్రెస్‌కి పట్టిన గతే టిడిపికి కూడా పడుతుందనడంలో సందేహం లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -