Friday, May 3, 2024
- Advertisement -

అవిశ్వాసంపై చర్చలోనూ చురకలు చమక్కులు

- Advertisement -

మోడీ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నేటి పార్లమెంట్ లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవిశ్వాసంపై చర్చలో భాగంగా అప్పటివరకూ మోడీపై నిప్పులు చెరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగం ముగించే ముందు మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. మోడీ కూడా నవ్వుతూ రాహుల్‌ను పలకరించి.. భుజం తట్టారు. నా మీద మీలో కోపం, ద్వేషం ఉన్నాయి. నేను వాటిని తొలగిస్తా’ అంటూ మోడీ దగ్గరికి వెళ్లి రాహల్ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి అలింగనం చేసుకోవడంతో మోడీ అవాక్కయ్యారు.

“నన్ను పప్పు అనుకున్నా పర్లేదు…దేశం కోసం భరిస్తా” అని రాహుల్ గాంధీ చర్చ సందర్భంగా సభలో అన్నారు. 2016 డిసెంబర్ లో రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. చర్చల మాటెత్తితో పారిపోతున్నారు. నాకు మాట్లాడే అవకాశమివ్వట్లేదు. నేను మాట్లాడితే భూకంపం వస్తుంది. అని అన్నారు. దీంతో నేడు రాహుల్ సభలో మాట్లాడినప్పుడు భూకంపం వచ్చిందా ? అంటూ నెటిజన్లు, బీజేపీ నేతలు ట్విట్టర్ లో జోకులు షేర్ చేసుకున్నారు.

ఏపీలో బీజేపీ వైఎస్ఆర్ సీపీ సహా మిగతా పార్టీలతో కుమ్మక్కై, టీడీపీని అడ్డుకోవాలని చూస్తోందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అన్నారు. వైఎస్ ఆర్ సీపీ ఎంపీలు మోడీ గెస్ట్‌ లిస్టులో ఉంటే…టీడీపీ ఎంపీలు నిఘా లిస్టులో ఉన్నారని పంచ్ డైలాగ్ పేల్చారు.

మరోవైపు చర్చలో భాగంగా మోడీ ‘మోసగాడు’ అనే పదాన్ని గల్లా జయదేవ్ ఉపయోగించారని, ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాను రానంటునే ఓటింగ్ కు వచ్చిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి సోనియా గాంధీ ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో జేసీ సోనియాతో కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్డి కులస్తులకు తీరని అన్యాయం చేశావ్.. తెలుగు రాష్ట్రాల్లోని రెడ్డి కులస్తులు కాంగ్రెస్‌ను నమ్ముకొని నిలువునా మునిగిపోయారు’’ అంటూ జేసీ సోనియాకు దండం పెట్టారు. ఈ మాటలకు నవ్వుతూ సోనియా అక్కడ నుంచి వెళ్లిపోయారు.

సీబీఐ కేసులకు భయపడి కేసీఆర్ మోడీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
అందుకే అవిశ్వాసానికి మద్దతు తెలిపక, బీజేపీకి ఓటు వేయక టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -