Tuesday, May 7, 2024
- Advertisement -

వైఎస్ఆర్ సీపీ రహస్య అస్త్రం కత్తి మహేశ్

- Advertisement -

కత్తి మహేశ్ మళ్లీ హడావుడి మొదలు పెట్టాడు. ఈ సారి విజయవాడ కేంద్రంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్రీరాముడు, రామాయణంపై ఆ మధ్య అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు. విషయం సీరియస్ గా మారడంతో మతకలహాలు రెచ్చగొట్టే ధోరణిపై మండిపడ్డ హైదరాబాద్ పోలీసులు అతడిపై నగర బహిష్కరణ వేటు వేయడం తెలిసిందే. మళ్లీ తమ అనుమతి లేనిదే హైదరాబాద్ లో అడుగుపెట్టరాదని గట్టిగా హెచ్చరిస్తూ ఆంక్షలు విధించారు. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన కత్తి మహేశ్ కొన్నాళ్లు బెంగళూరు కేంద్రంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా తెరమరుగైపోయాడు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు పలు టీవీ చానెళ్లు, యూ ట్యూబ్ చానెళ్ల డిబేట్లలో పాల్గొనేవాడు. మూవీలపై రివ్యూలు ఇచ్చుకుంటూ నాలుగు డబ్బులు సంపాదించుకునేవాడు. అయితే హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ విధించడంతో కత్తి మహేశ్ క్రమంగా మీడియాకు, యూ ట్యూబ్ చానెల్స్ కు దూరమైపోయాడు. మీడియా అతడిని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. దీంతో అతడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయాడు. అదే విషయాన్ని తాజాగా చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ పోలీసులు నా ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. నగర బహిష్కరణ వల్ల నాకు బతుకుతెరువు భారమైంది. అని సన్నిహితుల వద్ద చెప్పుకున్నాడు.

తాజాగా విజయవాడ, గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియా మిత్రులకు కనిపించాడు. తాను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడినే కనుక ఇకపై ఏపీలోనే నివశించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. హైదరాబాద్ సిటీలో మాత్రమే తనపై నిషేధం ఉందన్నాడు. హైదరాబాద్ కాకుండా తెలంగాణ అంతా ఎక్కడైనా తాను నివశించవచ్చునని చెప్పాడు. కానీ ఏపీ వ్యక్తిగా ఇకపై ఏపీలోని విజయవాడలో తాను నివశించదల్చుకున్నట్లు కత్తి మహేశ్ తెలిపాడు. అయితే అతడు వైఎస్ఆర్ సీపీ తరఫున ఇకపై పని చేయనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని కత్తి మహేశ్ వైఎస్ఆర్ సీపీ తరఫున ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీతో రహస్య చర్చలు జరిగాయని, మంచి ప్యాకేజ్ మాట్లాడుకునే కత్తి రంగంలోకి దిగుతున్నాడని సమాచారం. అయితే అతడితో వైఎస్ఆర్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని బయటకు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే హిందువుల మనోభానాలు దెబ్బతినేలా శ్రీరాముడు, రామాయణంపై కత్తి చేసిన వ్యాఖ్యలను ఏ హిందువు మరిచిపోలేడు. ఆయన మీద ఇప్పటికీ తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ తమ పార్టీలో చేరాడని, తమ పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడని, జనసేన అధ్యక్షుడుని లక్ష్యంగా చేసుకుని ఇక పని చేస్తాడని కానీ బహిరంగంగా తెలిస్తే హిందువుల ఓటు బ్యాంక్ జగన్ పార్టీకి దూరమవడం ఖాయం. అందుకే కత్తి మహేశ్ తో వైఎస్ఆర్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని, జనం నమ్మేలా ఆ పార్టీతో పాటు అతడి వ్యూహాలు ఉండబోతున్నాయి. మరి ఈ పదునైన కత్తి ఈ సారి ఎటునుంచి నరుక్కొస్తుందో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -