Wednesday, April 24, 2024
- Advertisement -

సెప్టెంబర్ 17 : కాకరేపుతున్న వివాదం.. కే‌సి‌ఆర్ ఎత్తుకు పై ఎత్తు ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో సెప్టెంబర్ 17 ను గురించిన చర్చ గట్టిగానే జరుగుతోంది. 1948 సెప్టెంబర్ 17 న నిజాం పాలనలో ఉన్న హైదరబాద్. అధికారికంగా భారతదేశంలో విలీనం అయింది. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే ఈ తారీఖుపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న బీజేపీ అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టె ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. దాంతో టి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టె విధంగా తెలంగాణలో సెప్టెంబర్ 17న విమోచన దినంగా జరపాలని బీజేపీ ఎప్పటినుంచో టి‌ఆర్‌ఎస్ ను డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ విషయంపై టి‌ఆర్‌ఎస్ మొదట్లో పెద్దగా స్పందించలేదు.

ఎందుకంటే ముస్లిం పాలన నుంచి అధికారికంగా విమోచన పొందినప్పటికి, మతపరమైన అంశం కావడంతో కే‌సి‌ఆర్.. ఈ అంశాపై స్పందించడంలో ఆచితూచి వ్యవహరించారు. బీజేపీ డిమాండ్ చేసినట్లుగా అధికారిక విమోచన దినంగా ప్రకటిస్తే.. టి‌ఆర్‌ఎస్ మిత్రపక్షం అయిన ఏంఐఏం నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందనే భావనతోనే కే‌సి‌ఆర్ సైలెంట్ గా వ్యవహరించరానే వాదన అమద్య బలంగా వినిపించింది. దీంతో డిఫెన్స్ లో పడ్డ కే‌సి‌ఆర్ పై.. మరింత పైచేయి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ 17 న విమోచన దినంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా అమిత్ షా తో తెలంగాణలో సెప్టెంబర్ 17 న భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ సైలెంట్ గా వ్యవహరిస్తే.. టి‌ఆర్‌ఎస్ కష్టాల్లో పడే అవకాశం లేకపోలేదు.

అందుకే కే‌సి‌ఆర్ ఊహించని విధంగా సెప్టెంబర్ 17 ను జాతీయ సమైఖ్య దినంగా జరపాలని నిర్ణయంచరు. ఎందుకంటే హైదరబాద్ అధికారికంగా భారత్ లో విలీనం అయినందున దానిని విమోచన దినం అనే కన్నా.. సమైఖ్యంగా ఇండియాలో హైదరబాద్ కలిసిందనే భావనను గట్టిగా ప్రజల్లోకి తీసుకెల్లెందుకే సెప్టెంబర్ 17 ను జాతీయ సమాఖ్య దినంగా కే‌సి‌ఆర్ ప్రకటించారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ఏంఐఏం కూడా సంఘీభవం తెలపడంతో సెప్టెంబర్ 16,17,18 మూడు రోజుల పాటు జాతీయ సమైఖ్య ఉత్సవాలను నిర్వహించాలని కే‌సి‌ఆర్ సిద్దమయ్యారు. దీంతో సెప్టెంబర్ 17 తో కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టాలని భావించిన బీజేపీకి.. కే‌సి‌ఆర్ వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తుగా నిలిచాయి. మరి ప్రస్తుతం కాకరేపుతున్న సెప్టెంబర్ 17 సంబంధించి ఇంకెన్ని వ్యూహ ప్రతివ్యూహాలను ప్రధాన పార్టీలు రచిస్తాయో చూడాలి.

Also Read

ఎల్లో మీడియా vs బ్లూ మీడియా.. ఏది జర్నలిజం !

పోరాడతారా.. ఇంటికే పరిమితం అవుతారా ?

పేద విద్యార్థులపై.. ఇంత నిర్లక్ష్యమా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -