Friday, May 24, 2024
- Advertisement -

కేసీఆర్ మ‌ళ్లీ రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌నున్నారా?

- Advertisement -

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ‌చ్చే శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలు నుంచి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేషుకులు.కేసిఆర్ 2014 ఎన్నికల్లో గజ్వెల్ శాసనసభ నియోజకవర్గం నుంచే కాకుండా మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కేసిఆర్ లోకసభకు రాజీనామా చేశారు. అయితే ఈసారి గజ్వెల్ నియోజిక వ‌ర్గంలో ఆయ‌నకు తీవ్ర పోటీ ఎదురు కానుంద‌ని తెలుస్తుంది.డీకే అరుణ ఈసారి గజ్వెల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తాన‌ని సవాల్ విస‌ర‌డం,పైగా ఆమెకు ఆ నియోజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉండ‌టంతో కేసీఆర్ ఈ స్థానంపై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని తెలుస్తుంది.

ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీల మధ్య పొత్తు ఉండడంతో కేసిఆర్ తీవ్రమైన పోటీ ఎదుర్కుంటారని చెబుతున్నారు. పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు ఆయన మరో చోటి నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. బహుశా ఆయన మేడ్చెల్ నియోజకవర్గం నుంచి సైతం పోటీ చేయవచ్చునని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించలేదు.  గజ్వెల్ నుంచి వంటేరు ప్రతాపరెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.ఇలా రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమి కాదు.గతంలో ఎన్టీఆర్ ,చిరంజీవిలు కూడా రెండు స్థానాల‌లో పోటీ చేసిన‌వారే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -