Sunday, April 28, 2024
- Advertisement -

అనంతబాబుపై సస్పెన్షన్ వేటు

- Advertisement -

ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్‌ చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉండటంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. తానే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.

తొలత ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అనంత బాబు ప్రయత్నాలు చేశాడు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ప్రమాదంలో చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అటు పోలీసులు సైతం అనంతబాబు అరెస్టు విషయంలో ఉదాసీనంగా వ్యవహించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతబాబును అరెస్టు చేస్తే కానీ పోస్టుమార్టానికి అంగీకరించబోమంటూ బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ప్రతిపక్షాలు సైతం బాధిత కుటుంబానికి అండగా నిలవడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అనూహ్యంగా అనంతబాబు లొంగిపోయాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఉగ్రనిధుల కేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు

కోనసీమ అల్లర్ల అనుమానితుడి అరెస్టు

మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -