Friday, March 29, 2024
- Advertisement -

డ్రైవర్‌ను తానే చంపానని ఒప్పుకున్న ఎమ్మెల్సీ

- Advertisement -

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంత బాబును పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అనేక మలుపులు తిరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అంతా అనుమానించినట్లే ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ దోషి అని తేలింది.

తన దగ్గర పని చేసి మాసేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు అనంతబాబు పోలీసుల విచారణలో అంగీకరించారు. తాను ఒక్కడినే సుబ్రహ్మమణ్యాన్ని కొట్టి చంపినట్లు తెలిపారు. తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం వల్లే చంపేశానని పోలీసుల విచారణలో అనంతబాబు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు రహస్యంగా విచారించారు.

శుక్రవారం సుబ్రహ్మణ్యాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినప్పటి నుంచి డెడ్‌ బాడీనీ తన కారులో అతడి ఇంటికి తీసుకొచ్చే వరకు ఏం జరిగిందో అనంతబాబు నుంచి పోలీసులు రాబట్టారు. సోమవారం ఉదయమే అనంతబాబును అదుపులోకి విచారించిన పోలీసులు రాత్రికి అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

క్షమాపణలు చెప్పండి లేదంటే పది కోట్లు కట్టండి

మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -