Saturday, April 20, 2024
- Advertisement -

కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారు : కొడాలి నాని

- Advertisement -

ఏపిలో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలపై మరోసారి మండిపడ్డారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు కనీస పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య  జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. ఏనుగు వెళితే కుక్కలు మొరుగుతాయన్నా చందనంగా జగన్ స్పందించకపోయినా, జరిగినదంతా చూసిన విజయమ్మ తల్లిగా స్పందించారు.

దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.  వివేకా హత్య కేసులో నాడు అధికారంలో ఉన్న టీడీపీ మంత్రులు, ఆ పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిర్‌ పోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.  దీన్ని ఎన్‌ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. 

వివేక హత్య జరిగిన సమయంలో మూడు నెలలు సీఎంగా ఉన్న చంద్రబాబు, హత్య కేసు ఆధారాలు చెరిపి వేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు వ్యవహారంతో తన తండ్రి హత్య కేసు సిబిఐ ద్వారా విచారణ చేయించాలని ఆయన కుమార్తె విజ్ఞప్తి చేశారు. దోషులను తేల్చాల్సిన సి.బి.ఐ, యన్.ఐ.ఎ. ల ఎంక్వయిరీ కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఏపి సీఎం జగన్ కి కృతజ్ఞతలు : రమణ దీక్షితులు

పాపం శశికళ.. ఎంతపనైంది!!

ప్రభుత్వానికి ఏకుకి మేకు లా తయారు అయిన హై కోర్టు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -