Thursday, May 9, 2024
- Advertisement -

మానవత్వం మరిచావా లోకేష్….. వైఎస్ మరణంపై ఎకసెక్కాలా

- Advertisement -

తన చివరి ప్రయాణంలో కూడా చిత్తూరు జిల్లాలో ప్రజలను కలవడానికి వెళుతూ…… ఆ ప్రజల సమస్యలను వినాలన్న ఆలోచనలోనే ప్రాణాలు విడిచాడు వైఎస్సార్. ఆ మరణం కూడా ప్రమాదం కాదు హత్య అన్న ఆరోపణలూ ఈ రోజుకూ బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణల్లో సోనియా, చంద్రబాబు, రిలయన్స్‌ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా వైఎస్ మరణాన్ని పరిహసిస్తున్నారు నారా చంద్రబాబు, లోకేష్‌లు.

తిరుమలలో వజ్రాలు, ఆభరణాలు కొట్టేయడం, రహస్య పూజలు లాంటి వ్యవహారాల్లో నారా వారి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య దుర్గ గుడిలో అర్థ రాత్రి క్షుద్ర పూజల కథ కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరుమల వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. తిరుమలలో జరిగిన తప్పులపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ఉద్ధేశ్యం నారావారికి లేదు. కానీ ప్రతి విషయంలోకీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని లాగినట్టుగానే ఇప్పుడు తిరుమల విషయంలో కూడా జగన్ పేరు తెచ్చారు.

అతి జుగుప్సాకరమైన విషయం ఏంటంటే తిరుమలతో పెట్టుకున్నవాళ్ళు ఏమైపోయారో మీకే బాగా తెలుసు అంటూ వైఎస్ జగన్‌ని నారా చంద్రబాబు, నారా లోకేష్‌లు సెటైరికల్‌గా ప్రశ్నిస్తున్నారు. ఈ మాటల్లో ఉన్న శ్లేష అర్థం చేసుకోలేనిది కాదు. నారా వారి నుంచి అందిపుచ్చుకున్న పచ్చ జనాలు తిరుమలతో పెట్టుకున్నందుకే వైఎస్ చనిపోయాడని రాక్షస రాతలు రాస్తున్నారు. మరి అదే జనాలు చంద్రబాబు ఏ తప్పు చేస్తే తిరుమల వెంకన్న బాబుపై బాంబు దాడి చేయించాడో చెప్పగలరా? గంపెడు సంతానం ఉండి కూడా చివరికీ ఎవ్వరూ లేనివాడుగా……. ఎవ్వరికీ చెందని వాడిగా ఏ దిక్కూలేకుండా చనిపోయిన మహా నటుడు, గొప్ప నాయకుడు అయిన ఎన్టీఆర్ అలా ఎందుకు చనిపోయాడో చెప్పగలరా? అవి కూడా తిరుమల వెంకన్న వధించిన శిక్షలేనా? ఇక తాజాగా వైఎస్ మరణం టైం నుంచీ సీక్రెట్‌గా రాసుకుపూసుకు తిరుగుతూ ఇప్పుడు ఓపెన్‌గా కలిసిపోతున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర కుటుంబంలోని నాయకుల మరణాల గురించి నారా వారు ఏం చెప్తారు? రాజకీయంగా విమర్శలు చెయ్యొచ్చు కానీ చనిపోయిన తండ్రి మరణం గురించి రాక్షసంగా మాట్లాడుతూ శాడిస్ట్‌ల్లా ఆనందపడాలన్న ఆలోచన ఆయా నాయకుల రాక్షస మనస్తత్వాన్ని బయటపెడుతుందే తప్ప వైఎస్‌లకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అని సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -