Thursday, April 25, 2024
- Advertisement -

అప్పుల ఊబిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు !

- Advertisement -

ప్రస్తుతం దేశంలో బీజేపీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా చాలా రాష్ట్రాలలో బీజేపీ పాలన జరుగుతోంది. అదే సమయంలో కరోనా కరణంగా చాలా రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2020-21 అప్పుల భారం అధికంగా ఉన్న రాష్ట్రాలలో రాజస్తాన్ , బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అధిక అప్పు భారం కలిగిన రాష్ట్రాలుగా ఆర్బీఐ వెల్లడించింది. .

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే ..బిహార్, హర్యానా వంటి రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బిహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలలో ద్రవ్యోల్బణం 3 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ పరిపాలన నడుస్తోంది. మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి కూడా ఈ నాలుగు రాష్ట్రాలలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం రేటు పెరిగిందంటే బీజేపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ నాలుగు రాష్ట్రాలలో అభివృద్ది ఎలా ఉన్న అప్పులు మాత్రం అధికంగా ఉండడంతో ఆ రాష్ట్రాల జీడీపీ పై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో ఆ రాష్ట్రాలలో నిత్యవసర ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇదే గనుక జరిగితే ఇక్కడి బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. మరి ఆర్థిక లోటుతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ రాష్ట్రాలను బయట పడేసేందుకు బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పెను సంక్షోభంలో పాకిస్తాన్ ..గట్టెక్కేనా ?

అగ్నిపథ్ అల్లర్ల వెనుక.. పెద్ద కుట్రే ఉందా ?

భారత్ కు షాక్ ఇస్తున్న,, ఆస్ట్రేలియా బొగ్గు సంక్షోభం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -