Thursday, April 25, 2024
- Advertisement -

నేతల బూతు పురాణం..జగన్ కు తలనొప్పి !

- Advertisement -

గతకొంత కాలంగా వైసీపీపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. నర్సాపురం లో వైసీపీ తరుపున ఎంపీ గా పోటీ చేసి గెలుపొందిన ఆర్ఆర్ఆర్, ఆ తరువాత సొంత పార్టీ కే కొరకరాని కొయ్యలా మారాడు. వైసీపీ ని దెబ్బతీసే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదలకుండా మీడియా ముందుకొచ్చి జగన్ రెడ్డి పై , వైసీపీ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటాడు రఘురామ కృష్ణంరాజు. ఐతే ఆర్ఆర్ఆర్ చెప్పే మాటలు ప్రజలు వింటున్నారా ? లేదా ? అనే సంగతి అలా ఉంచితే, రఘురామ యాక్షన్ కు వైసీపీ నేతల రియాక్షన్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంది.

ఇక తాజాగా సోషల్ మీడియా లో రఘురామ వర్సస్ విజయ్ సాయి రెడ్డి చేసుకున్నా వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. రఘురామ కొంత కాలంగా డిల్లీ లోనే ఉంటున్నారు. తన నియోజిక వర్గం రావడం లేదు. దీనిపై స్పందిస్తూ విజయ్ సాయి రెడ్డి.. ” అడగకుండానే నియోజికవర్గం వదిలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసిన ఏకైక రాజు, విగ్గురాజు.. పెగ్గురాజు ! అంటూ కామెంట్ చేశాడు. దీనికి రఘురామ కృష్ణంరాజు కూడా ఘాటుగానే బదులిచ్చారు. అజ్ఞాత వాసం తర్వాత పాండవులకు.. అరణ్య వాసం తర్వాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకమే.. చచ్చింది కౌరవులే ముందు అది తెలుసుకోరా కండోమ్‌ రెడ్డీ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ సాయి రెడ్డి.. ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా వరిజినలేనా లేక అవి కూడా పీకి అంటించుకున్నవా.. వాటిని మెలి తిప్పడం ఎందుకురా అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ గా రఘురామ కృష్ణంరాజు.. ఎవరు ఒరిజినల్ రాజో.. ఎవరు డూప్లికేట్‌ రెడ్డో.. ప్రజలకు తెలుసు.. మనం కలిసినప్పుడు.. నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో అంటూ రఘురామ బదులిచ్చారు.

ఈ విధంగా ఒకే పార్టీకి చెందిన నేతలు ఘాటుగా ఒకరినొకరు తిట్టుకోవడం. పార్టీని దిగజార్చడమే అవుతుందందని రాజకీయ విశేషకులు చెబుతున్నారు. అయితే నేతల ఈ బూతుల పురాణం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జగన్ కు తలనొప్పిగా మరే అవకాశం ఉంది. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కోడాని నాని బూతుల నానిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నాని మాత్రమే కాకుండా వైసీపీ లోని చాలా మంది నేతల భాష చాలా అసహ్యంగా ఉంటుందని ఇప్పటికే ప్రజల్లో చెడ్డ పేరు ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ సాయి రెడ్డి వర్సస్ రఘురామ బూతు వ్యాఖ్యలు ప్రస్తుతం పోలిటికల్ హిట్ పొంచుతున్నాయి. ఏది ఏమైనప్పటికి నాయకుల బాష తీరు ప్రజల్లో నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ముందు రోజుల్లోనైనా నాయకుల మాట తీరుపై జగన్ చర్యలు తీసుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

భారత్ కు షాక్ ఇస్తున్న,, ఆస్ట్రేలియా బొగ్గు సంక్షోభం !

వైసీపీ లో జంపింగ్ జపాంగ్ ..షురూ ?

నో రిటైర్మెంట్ అంటున్న జిన్ పింగ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -