Tuesday, April 23, 2024
- Advertisement -

ఏక‌గ్రీవాల‌పై ఎస్ఈసీ కుట్ర‌పూరిత వ్య‌వ‌హారం!

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విచక్షణ మ‌ర‌చిపోయి కుట్రపూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఓ పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్న‌‌ట్లు ఉంద‌ని టీడీపీని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేశారు. విచక్షణాధికారాలు విచక్షణతో ఉప‌యోగించడానికి ఉంటాయ‌ని, కానీ నిజాలు మాట్లాడిన అధికారులను ఆందోళనలకు గురిచేయడానికి కాదని నిమ్మ‌గ‌డ్డ‌కు హిత‌వు ప‌లికారు.

నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి… పంచాయ‌తీరాజ్ ‌ శాఖ అధికారులపై నిమ్మగడ్డ తీసుకున్న చర్యలను ఆయన విచక్షణకే వ‌దిలేస్తామ‌న్నారు. ఎల‌క్ష‌న్‌ కోడ్‌ ముగిసిన అనంత‌రం ప్రభుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అధికారుల‌కు ఊర‌ట క‌లిగించారు. ప్రజల సంక్షేమం కోసం ప‌నిచేసే అధికారుల‌కు గ‌వ‌ర్న‌మెంట్ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

ఇక పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ‌… ఏకగ్రీవాలను పరిశీలించేందుకు ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని ఎన్నికల కమిషనర్ అన‌డంపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచుతూ పోయినేడాది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుందన్న‌ నిమ్మగడ్డ.. ఇప్పుడు ఏకగ్రీవాలను అడ్డుకునేలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్రశ్నించారు. ఏకగీవ్ర పంచాయతీలకు 2001 నుంచి ఇస్తున్న ప్రోత్సాహకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భారీగా పెంచిందని మంత్రి తెలిపారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేకు నాన్ బెయిల‌బుల్ వారెంట్

అందాల రాక్ష‌సి ముద్దు పెడుతోందా?

ఆస్ప‌త్రిలో చేరిన గంగూలీ

పవర్‌ స్టార్‌ సినిమాలో యాంకర్‌ అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -