పవన్ కళ్యాన్ పై పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ అజ్ఞాతవాసి అనే అనుకున్నామని… ఆయన అజ్ఞానవాసి అని కూడా తెలిసిందని ఎద్దేవా చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఈరోజుకు నిందితులను పట్టుకోలేకపోయా రని పవన్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ నేతలకు తానంటే భయమని పవన్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఎద్దేవా చేశారు.

- Advertisement -

భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవరు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు? విశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నా భాజపాను ఎందుకు ప్రశ్నించరు?’’ అని పవన్‌ను పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు నాయుడితో తిరిగి తిరిగి పవన్ కల్యాణ్ సొల్లు మాటలు ఎక్కువైపోయాయని విమర్శించారు.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

సోనుసూద్ పేరిట ఘరానా మోసం!

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -