Thursday, May 9, 2024
- Advertisement -

ఒంగోలు పార్ల‌మెంట్ సీటు ఖ‌రారు….. టిడిపి వదిలేసి వైసీపీలోకి దూకటానికి సిద్ధం

- Advertisement -

ఏపీలో అధికార పార్టీకి త‌గుల‌తున్న వ‌రుస దెబ్బ‌ల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌భుత్వంమీద రోజు రోజుకి ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌… మ‌రో వైపు ప‌ర్టీ సీనియ‌ర్ నేత‌ల్లో అసంతృప్తి. ఇన్నాల్లు అధికార‌పార్టీలోకి వ‌స‌లు ప్రారంభ‌మ‌యితె ఇప్పుడు వైసీపీలోకి వ‌ల‌సలు కొన‌సాగ‌నున్నాయి. తాజాగా ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి మ‌రో పెద్ద‌షాక్ త‌గ‌ల‌నుంది.
తెలుగుదేశంపార్టీలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎంఎల్సీ వైసీపీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నేత ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఎప్పుడవసరం వచ్చినా సరే వెంటనే టిడిపి వదిలేసి వైసీపీలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లు సదరు నేత జగన్ తో చెప్పారని తెలిసింది. ప్రస్తుత టిడిపిలో సదరు నేతకు పార్టీలోని నేతలతో పెద్దగా సంబంధాలు లేవనే చెప్పాలి. ఏదో పార్టీలో ఉన్నారు కాబట్టి అవసరం మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంతే.
ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది.పార్టీలోకి వెల్లే స‌మ‌యంలో ఎమ్మెల్సీప‌ద‌వికి రాజీనామ‌చేస్తారాలేకా వైసీపీలోకి వెల్తారా అన్న‌ది స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్ల‌మెంట్ స్థానంలో పోటీ చేయాల్సిందిగా జ‌గ‌న్ కోరిన‌ట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పార్లమెంటు సభ్యునిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి సేవలను వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ఉపయోగించుకోవాలని కూడా జగన్ నిర్ణయించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వైవికి వచ్చే ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నేతలను సమన్వయపరిచే బాధ్యతను అప్పగించినట్లు కూడా సమాచారం.మ‌రి చంద్ర‌బాబు ఆయ‌న వెల్ల‌కుండా ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -