Saturday, April 27, 2024
- Advertisement -

జగన్ ఆశీస్సులు ఆయనకే

- Advertisement -

ఎన్నికల సమయంలో పార్టీ మారేవాళ్లు కొందరైతే, ఎన్నికల్లో గెలిచాక అధికార పార్టీలోకి ఫిరాయించేవాళ్లు ఇంకొందరు. కానీ పార్టీ కష్టకాలంలో అధినేత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడనివాళ్లు ఇంకొందరు. ఈ మూడో కోవకే చెందుతారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన చెంచు గరటయ్య వృత్తిరీత్యా వైద్యుడు. నాడు ఎన్టీఆర్ హయాంలో ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ప్రధానంగా సాగు, తాగు నీటి సమస్యలతో పాటు రైతు సమస్యల పరిష్కారానికి డాక్టర్ గరటయ్య ఎనలేని కృషి చేశారు. విడతల వారీగా నియోజకవర్గానికి దాదాపు 30 వేలకు పైగా ఇళ్లను మంజూరు చేయించిన ఘనత గరటయ్యదే. ఈయన ప్రజాసేవను గమనించే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ మరణం తర్వాత డాక్టర్ గరటయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను జగన్ ఆయనకు అప్పగించారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ టికెట్ మాత్రం గొట్టిపాటి రవికుమార్ కు ఇచ్చారు జగన్. రవికుమార్ గెలుపునకు కృషి చేయాలని జగన్ ఆదేశించడంతో గరటయ్య పూర్తి సహాయసహకారాలు అందించి గొట్టిపాటి రవికుమార్ విజయానికి కృషి చేశారు. కానీ ఎన్నికల అనంతరం గొట్టిపాటి పార్టీ ఫిరాయించి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

తనకు ఒకసారి టికెట్ నిరాకరించినా, వేరే అభ్యర్ధికి టికెట్ ఇచ్చినా నిజాయతీగా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన డాక్టర్ గరటయ్యకే మళ్లీ అద్దంకి వైఎస్ఆర్ సీపీ బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. తన సేవలను, పార్టీ పట్ల చిత్తశుద్ధి, అంకితభావాన్ని గుర్తించిన జగన్, నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు మళ్లీ తనకే అప్పగించడంతో ఈ సారి గరటయ్య రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. గడపగడపకూ వైఎస్ఆర్ తీసుకెళ్లడంతో పాటు, వైఎస్ జగన్ చెబుతున్న నవరత్నాలు పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్రలోనూ గరటయ్య చురకైన పాత్ర పోషించారు. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఏపీలో మళ్లీ రాజన్న పాలన రావాలన్నా రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలన్నా, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలన్నా, వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమని బాచిన చెంచు గరటయ్య స్పష్టం చేస్తున్నారు. ఈ సారి తనకు లేదా తన కుమారుడు కృష్ణచైతన్యకు అద్దంకి అసెంబ్లీ టికెట్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా, జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలందరు సహకరించాలని డాక్టర్ గరటయ్య కోరారు. చంద్రబాబు పాలనలో అవినీతి, టీడీపీ నేతల అభివృద్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి ఏమాత్రం జరగలేదని విమర్శిస్తున్నారు. ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు, టీడీపీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అటు ప్రభుత్వంపై విమర్శలతో పాటు ఇటు వైఎస్ఆర్ సీపీ ఆశయాలు, లక్ష్యాలను, ప్రజలకిస్తున్న హామీలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్తున్న డాక్టర్ చెంచు గరటయ్య ఇప్పటికే జగన్ కు నమ్మినబంటుగా నిరూపించుకున్నారని, ఇక రేపో మాపో టికెట్ దక్కించుకుని మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అద్దంకి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -