Thursday, May 9, 2024
- Advertisement -

ప్ర‌కాశం జిల్లా వైసీపీ బ్రోక‌ర్ల‌పై పార్టీ క‌న్ను..?

- Advertisement -

వైసీపీ కంచుకోట ప్ర‌కాశం జిల్లాలో బ్రోక‌ర్ల బెడ‌ద ఎక్కువైందా..? పార్టీ అధినేత త‌మ‌కు తెలుసంటూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ల‌నుంచి పెద్ద‌మొత్తంలో వ‌సూలు చేస్తున్నారా..? అందుకు ఊతం ఇచ్చేలా వైఎస్ జ‌గ‌న్ సొంత మీడియా సాక్షి బ్యూరో చీఫ్ పెద్దఎత్తున దండుకుంటున్నారా..? అంటే అవున‌నే అనిపిస్తోంది ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు చూస్తుంటే.

2019ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టిస్తారంటూ స‌ర్వేలు ఢంకాభ‌జాయించి చెబుతున్నాయి. దీంతో ఏపీ అధికార పార్టీ అధినేత చంద్ర‌బాబుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న‌ట్లు గుస‌గుస‌. ఈ నేప‌థ్యంలో వైసీపీ లో బ్రోక‌ర్ల బెడ‌ద తారాస్థాయికి చేరిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

పార్టీ అధినాయ‌క‌త్వం త‌మ‌కు తెలుస‌ని, త‌మ‌మాటే శాస‌న‌మంటూ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ముఖ్య‌నేత‌ల్ని, ఇంఛార్జ్ ల వ‌ద్ద త‌మ‌దందా షూరు చేస్తున్న‌ట్లు టాక్. ఈ దందా చేస్తున్న‌వారిలో అక్కిరెడ్డి, అశోక్, కందుకూరు శేషా రెడ్డి, కందుకూరు కొండారెడ్డిల పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. పార్టీలో, అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో ఏ ర‌చ్చ‌బండ‌చూసినా, మీటింగ్ ల్లో ఏ న‌లుగురు క‌లిసినా వీరి గురించే ఒక‌టే చ‌ర్చంట‌.

దీనికితోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అఖండ మెజార్జీతో గెలుస్తార‌ని స‌ర్వేలు వెల్ల‌డించాయో లేదో అప్ప‌టి నుంచి ఈ బ్రోక‌ర్ల హ‌డావిడి ఎక్కువైన‌ట్లు చ‌ర్చ‌న‌డుస్తోంది. జ‌గ‌న్ సొంత మీడియా అయిన సాక్షి బ్యూరో ర‌మ‌ణారెడ్డి సైతం జిల్లాల్లో టికెట్లు ఆశిస్తున్న నేత‌ల నుంచి భారీ మొత్తంలో వ‌సూలు చేస్తున్నార‌ట‌. ఎంత‌లేద‌న్న ఒక్కో ఇంఛార్జ్ నుంచి రూ. 5ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

అది ఎంత‌లా అంటే నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న నేత‌లు డ‌బ్బులు ఇచ్చారా..? స‌రేస‌రి లేదంటే నెగిటీవ్ గా రిపోర్ట్ పంపిస్తాం. పార్టీ హైక‌మాండ్ వ‌ద్ద మేం ఎంత చెబితే అంత‌.. ఇస్తారా..? లేదంటే త‌ప్పుడు రిపోర్ట్ పంపించాలా అని బెదిరిస్తున్నార‌ట‌.

అలా బెదిరించి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌నే అకార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంఛార్జ్ గా ఉన్న తుమాటి మాధ‌వ‌రావు గురించి త‌ప్పుడు రిపోర్ట్ లు పంపించిన‌ట్లు, దీంతో పార్టీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న్ను ప‌ద‌వినుంచి తొల‌గించిన‌ట్లు వైసీపీ లో వినిపిస్తున్న వాద‌న‌.

అంతేకాదు పార్టీ హైక‌మాండ్ కు పంపించే రిపోర్ట్ పాజిటీవ్ గా రాయాలి. కాబ‌ట్టి పెద్ద‌మొత్తంలో చెల్లించాల‌ని ర‌మ‌ణారెడ్డి బెదిరించిన‌ట్లు, అలా తూమాటి మాధ‌వ‌రావు నుంచి రూ.7ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు ఆయ‌న అనుచ‌ర‌లు వాపోతున్నార‌ట‌. ర‌మ‌ణారెడ్డి ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట‌వేయాల‌నే ఉద్దేశంతో ర‌మ‌ణారెడ్డి పార్టీ నేత‌ల‌తో జ‌రిపిన ట్రాన్సాక్ష‌న్లను త్వ‌ర‌లో బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌.

ఇప్పుడు ఈ బ్రోక‌ర్ల క‌న్ను క‌నిగిరి వైసీపీ ఇంఛార్జ్ బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ మీద‌ప‌డింద‌ట‌. త‌న‌కు అనుకూలంగా లేడ‌న్న అకార‌ణంగా ర‌మ‌ణారెడ్డి లేక‌పోతే మిగిలిన మీడియా ప్ర‌తినిధుల‌తో చేతులు క‌లిపి..బుర్రామ‌ధుసూద‌న్ యాద‌వ్ చేస్తున్న పార్టీ కార్య‌క్ర‌మాలు, అభివృద్దిప‌నులు వెలుగులోకి రాకుండా.. నెగిటీవ్ వార్త‌లు వ‌చ్చేలా చ‌క్రం తిప్పుతున్నార‌నే మాట వినిపిస్తోంది.

ఇలాంటి దందాలు అన్నీ జిల్లాల్లో ఉన్న ప్ర‌కాశం జిల్లాలో మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ట‌. ఇలాంటి దందాలు ఆప‌క‌పోతే పార్టీకి ఇబ్బంది క‌లుగుతుంది. ఇప్ప‌టికే ఈ బ్రోక‌ర్ల గురించి పార్టీ పెద్ద‌ల‌కు రిపోర్ట్ లు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇంఛార్జ్ ల‌ను పిలిచి వాళ్ల మీద రిపోర్ట్ ల‌ను తీసుకోవాల‌ని పార్టీ భావిస్తోంది. చూద్దాం పార్టీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -