Monday, April 29, 2024
- Advertisement -

ఎస్ఈసీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

- Advertisement -

ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తీసుకున్న మ‌రో నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. ఏక‌గ్రీవాల‌పై ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్న వేళ‌.. అనంత‌పురం జిల్లాలో గ‌తంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో యునానిమ‌స్ అయిన ప్రాంతాలను ఎస్ఈసీ అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ విష‌యం గురించి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నిక‌ల సిబ్బందిపై న‌మ్మ కం ఉంది అంటూనే, అవ‌స‌ర‌మైతే కేంద్ర బ‌ల‌గాల‌ను ఇక్క‌డ‌కు పంపాల‌ని కోరామ‌న్నారు. ఏకగ్రీవాలు ఎప్పుడూ ఉంట‌గాయ‌ని, అయితే వీటికి సంబంధించి వార్తా మాధ్య‌మాల్లో ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ప‌ట్ల మాత్ర‌మే త‌మ‌కు అభ్యంత‌రం ఉంద‌న్నారు. అందుకే కొంత‌మంది అధికారుల‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

ఏక‌గ్రీవాల విష‌యంలో గవర్నర్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయన్న ఎస్ఈసీ.. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూదన్నదే త‌మ అభిమ‌త‌ని చెప్పుకొచ్చారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఏపీ పంచాయతీ యాప్ ద్వారా న‌మోదు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ యాప్ ద్వారా తాము ఫిర్యాదులు తీసుకుంటామ‌ని చెప్పారు.

ఏకగ్రీవాలు జరగకూడదని ఏ ఆర్టికల్‌లో రాసి ఉంది..?

స్పీడ్ పెంచిన పవన్‌ కల్యాణ్‌.. వర్మతో పవన్‌ కల్యాణ్‌ మూవీ… ‌

ఏకగ్రీవాలైతే నష్టమేంటి?

యువ హీరోతో లిప్‌లాక్‌కు రెడీ అయిన భామ‌..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -