పవన్ కల్యాణ్‌పై టాలీవుడ్ నిర్మాత సంచలన ట్వీట్ !

- Advertisement -

నటుడు, ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్.. వివాదాస్ప‌ద‌, విచిత్ర‌మైన కామెంట్లు చేస్తూ అప్ప‌ట్లో వార్త‌ల్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాడు. గ‌త కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న ఆయ‌న తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. ఈ సారి ఏకం‌గా రాష్ట్ర రాజ‌కీయాల్లో కాక‌పుట్టించేలా కామెంట్ చేశాడు. జ‌న‌సేన అధినేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆయ‌న చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది.

బండ్ల గ‌ణేష్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్ సినీ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయంగానూ తీవ్ర దుమార‌మే రేపుతోంది. బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్ లో “పాపాలు పోవాలంటే… ప‌వ‌న్ అన్న రావాలి” అని పేర్కొన్నాడు. ఎవరు పాపాలు చేశార‌నీ, ఎవ‌రిని ఉద్దేశించి బండ్ల గ‌ణేష్ ఈ వ్యాఖ్య‌లు చేశాడంటూ సినీ ఇండ‌స్ట్రీతో పాటు రాజ‌కీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

అయితే, బండ్ల గ‌ణేష్ ట్వీట్‌పై మొద‌ట‌గా అధికారా వైకాపా అభిమానులు, కార్య‌క‌ర్త‌లు స్పందించారు. ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ప‌వ‌న్ భ‌జ‌న మ‌రీ ఎక్కువైంద‌ని ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న 2018 అసెంబ్లీ ఎన్నిక‌లో టీఆర్ ఎస్ గెలిస్తే గొంతు కోసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల అనంత‌రం ట్రోల్స్ తో నెటిజ‌న్లు బండ్ల గ‌ణేష్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తన‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేద‌ని సైలెంట్ అయ్యాడు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -