Friday, April 26, 2024
- Advertisement -

వేడి పుట్టిస్తున్న ఆర్జీవీ నాని భేటీ ..?

- Advertisement -

కొంత కాలంగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య జరిగిన ట్వీట్ల వార్ కొనసాగింది. దీనికి తెరదించుతూ ఆర్జీవీ చర్చలు జరిపేందుకు నాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. కాగా ఈ రోజు వీరిరువు చర్చించనున్నారు. ఇరువురు ముఖాముఖిగా భేటీ కానున్నారు. వీరు ఏపీ సచివాలయంలో ఒకే టేబుల్ పై కూర్చొని చర్చింనున్నారు.

వీరి భేటిపై సినీరంగంతో పాటు సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటి వరకు ఇరువురి మధ్య జరిగిన చర్చలు గమనిస్తే ఎవరూ ఎక్కడా తగ్గినట్టు కనబడ లేదు. దాదాపు వారం రోజులుగా జరిగిన పరిణామాలను గమనిస్తే ఇరువురు తమ వాదనలను బలంగా సమర్దించారు. టికెట్ రేట్లను ఎందుకు పెంచాలో వర్మ బలంగా చెప్పారు. ఎందుకు పెంచాలి. కొందరి కోసం సామాన్యులపై భారం ఎందుకు వేయాలి. ఇది ఏ బేసిక్ ఎకనామిక్స్ ప్రకారం పెంచమంటున్నారు. అని నాని బలంగా తిప్పికొట్టారు. మీతో అనుమతిస్తే నేరుగా చర్చిస్తాను అని వర్మ చేసిన విజ్ఙాపనకు మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. (ఈనెల 10 న) నేడు అపాయింట్మెంట్ ఇచ్చారు.

సాధారణంగా వివాదాస్పదుడిగా, మీడియాలో ప్రచారం కోసమే మాట్లాడుతాడు వర్మ అనేది బలంగా ఉన్న వాదన. ఇంత వరకు వర్మ చేసిన ఆరోపణలను ఏ ప్రముఖుడు కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ మంత్రి నాని స్పందించి నేడు ఆయనతో భేటీ కానున్నరు. అయితే వర్మ దగ్గర పెద్ద క్వచ్ఛన్ బ్యాంకే ఉంది. వీటన్నింటికీ నాని సమాధానం చెబుతారా ? వాటికి వర్మ కన్వినెన్స్ అవుతాడా ? మంత్రి మాటలకు వర్మ సాటిసిఫై అవుతాడా ? ఈ భేటీతో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కివస్తుందా అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

క్రేజ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలంటున్న బాలయ్య

‘నువ్వు నా బలం.. నా సర్వస్వం’.. మహేష్ బాబు కంట కన్నీరు

మొన్న నాని, నిన్న వర్మ, నేడు నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -