‘నువ్వు నా బలం.. నా సర్వస్వం’.. మహేష్ బాబు కంట కన్నీరు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు తుది శ్వాస విడవడంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న మహేష్ బాబు హోంఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. తన సొంత అన్నయ్యను కడసారి కూడా చూసుకోలేకపోయారు.

దీంతో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తన కోసం రమేశ్ బాబు చేసిన త్యాగాలను గుర్తు చేసుకొని , చివరి సారి కూడా అన్నయ్యను చూసుకోలేక పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -

‘‘ నువ్వే నా స్ఫూర్తి ప్రదాతవి.. నువ్వే నా బలం.. నువ్వే నాకు ధైర్యం.. నువ్వే నాకు లోకం.. నువ్వే నాకు సర్వస్వం.. నువ్వు లేకుండా నేను ఈ రోజు ఉన్న స్థాయిలో సగం కూడా ఉండే వాడిని కాదు .. నాకోసం ఎంతో చేశారు.. ఇప్పుడు మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి.. నాకంటూ ఇంకొక జన్మంటూ ఉంటే అప్పుడు కూడా మీరే నాకు అన్నయ్యగా ఉండాలి. ’’ అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

మళ్లీ దోచేస్తున్నారబ్బా..!

స్ట్రీట్‌ ఫుడ్‌ డోర్ డెలివరీ కావాలా?

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -