Thursday, March 28, 2024
- Advertisement -

సోనియా ప్రణాళికలు.. రాహుల్ విదేశీ యాత్రలు !

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే చెప్పాలి. ఒకప్పటితో పోలిస్తే కాంగ్రెస్ అన్నీ రాష్ట్రాల్లో కూడా కాస్త వెనుకబడింది. ముఖ్యంగా 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి అంతా తలకిందులుగా మారిందనే చెప్పవచ్చు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో విభజన కారణంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయింది . ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా అందరూ మర్చిపోయారు. అంతో ఇంతో తెలంగాణలో కాస్త రానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇక జాతీయంగా కూడా 2014 లో యూపీఏ కూటమి దారుణంగా ఓటమిపాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులే మారిపోయాయి. .

ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు ఆ పార్టీ తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. అయినప్పటికి ఆశించిన స్థాయిలో ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడంలేదు. ఇక రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని సోనియా గాంధీ విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరితోనూ ఆమె డిల్లీలోని ఆమె నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె అంశాలపై సోనియా గాంధీ పార్టీ నేతలతో చేర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తుంటే.. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం తనకు సంబంధం లేదు అన్నట్లుగా విదేశీ యాత్రలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.

రాహుల్ పై మొదటి నుంచి కూడా సీరియస్ పొలిటీషియన్ కాదు అదే విమర్శ బలంగా ఉంది. ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తూ రాహుల్ వైఖరి కూడా అలాగే ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేయడం, కేంద్ర మంత్రి పదవి వచ్చినప్పుడు తిరస్కరించడం.. వంటివి చూస్తే రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి లేదనేది స్పష్టంగా అర్థమౌతుంది. ఇక తాజాగా పార్టీ బలోపేతం కోసం సోనియా అలుపెరుగకుండా శ్రమిస్తుంటే.. రాహుల్ మాత్రం హాయిగా విదేశాలకు చెక్కేయడం కాంగ్రెస్ నేతల్లో ఒకింత అసహనానికి గురి చేస్తుంది.

Also Read

భారత్.. శ్రీలంక దేశంలా మారుతోందా ?

మోడి చేసేది.. రాజ్యంగ విరుద్దామా ?

మోడి పాలనపై బేజారు.. అన్నిట్లో వెనుకడుగు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -