Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీలంక పరిస్థితి.. భారత్ లో తలెత్తనుందా ?

- Advertisement -

ప్రస్తుతం శ్రీలంక దేశ పరిస్థితి ఎలా ఉందో మనందరికి తెలుసు. అక్కడ సామాన్యుడు ఒక్క పూట అన్నం తినడానికే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆదేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం కూడా తలెత్తడంతో..దేశ నాయకులు సైతం చేసేదేమీ లేక అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. చేతకాని ప్రభుత్వ పాలనతో ప్రజల ఆగ్రహానికి లోనౌతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇండియా పరిస్థితి కూడా శ్రీలంక దేశంలా తయారయ్యే అవకాశం ఉందంటూ కొందరు రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. మోడి పాలనలో దేశంలో నిత్యవసర ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

తాజాగా టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యనిస్తూ.. ” ఇందనం, ఎల్పీజీ ధరల పెరుగుదలతో దేశం రాబోయే రోజుల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ లా మరాబోతుందంటూ ” మోడి ప్రభుత్వాపై విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు సైతం మోడి పాలనలో దేశం అధోగతి పలు అవుతుందంటూ, ప్రపంచ సూచికల్లో మనదేశం వెనుకబడ్డ ర్యాంకింగ్ లను చూపిస్తూ, దేశ అభివృద్ది కి కళ్ళెం పడుతోందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ భారీగా పడిపోయి డాలర్ విలువ పెరుగుతూ ఉండడం కూడా గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్థికాభివృద్ది గాడి తప్పుతోందనే వాదనలు కూడా వస్తున్నాయి. అయితే శ్రీలంక దేశాన్ని తలపించే ఆర్థిక సంక్షోభం మనదేశంలో తలెత్తే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

పార్లమెంట్ పై జాతీయ చిహ్నం.. మోడి పై విమర్శలు!

మోడి పాలనలో దేశం వెనుకడుగు.. ఆధారాలతో ?

తలవంచిన టీడీపీ, వైసీపీ .. అసలెందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -