Wednesday, May 8, 2024
- Advertisement -

డ్రామా సుఖాంతం….. బాబు డైరెక్షన్‌లో సుజనా – అమిత్ షా మీటింగ్స్ షురూ

- Advertisement -

చంద్రబాబునాయుడి నైజం అంతే. మాటల పని మాటలదే…… చేతల పని చేతలదే. మాటలకు- చేతలకు అస్సలు పొంతన ఉండదు. అధికారం తప్ప మరో విషయమేదీ పట్టని మహా నాయకుడు. అందుకే రాజకీయంగా తనకు ఉపయోగపడిన నాయకులను, ఓట్లేసి గెలిపించిన ప్రజలను కూడా వంచించడానికి అస్సలు వెనకాడడు. కావాలంటే 2014లో చంద్రబాబునాయుడు రచించిన టిడిపి ఎన్నికల మేనిఫెస్టో చదవండి. అందులో కనీసం ప్రధాన హామీలనైనా నెరవేర్చాడా? లేదా? అనే విషయం పరిశీలించండి. జగన్ ఆస్తలను స్వాధీనం చేసుకుని రుణమాఫీలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పటి వరకూ ఆ పని ఎందుకు చేయనట్టు? జగన్ దగ్గర అక్రమాస్తులు లేవని చంద్రబాబు సర్టిఫై చేస్తున్నాడా? 2014 ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తులు, ప్రత్యేక హోదా, ప్రపంచ స్థాయి రాజధాని, రుణమాఫీలాంటి మాటలు ఓట్లు కురిపిస్తాయి అనుకున్నాడు కాబట్టి చెప్పుకుంటూ పోయాడు.

ఇక 2019ఎన్నికల్లో ఓట్లు పడాలంటే 2014 ఎన్నికల్లో తాను ఎంతో పొగిడిన మోడీని తిట్టడం తప్ప మరో ప్రత్యమ్నాయం లేదన్నది చంద్రబాబు ఆలోచన. 2014 ఎన్నికల్లో అక్కరకొచ్చిన కెసీఆర్‌ని తిట్టే కార్యక్రమం కూడా ఈ సారి వర్కవుట్ అయ్యేలా లేదు. అందుకే ఎంచక్కా కెసీఆర్‌తో కలిసిపోయాడు. కెసీఆర్ పేరు స్థానంలో ఈ సారి మోడీ పేరు చేర్చాడు. నిజాయితీగా ఆలోచిస్తే నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న కార్యకలాపాలను మించి చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కానీ మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వీరాధివీరుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడంలో మాత్రం చంద్రబాబు నానా పాట్లూ పడుతున్నాడు.

ఇవన్నీ మాటల వ్యవహారాలు. ఇక ఇప్పుడు చేతలు మాత్రం మరోరకంగా షురూ అయ్యాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో అమిత్ షాతో చర్చలు షురూ చేశాడు సుజనాచౌదరి. 2019ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే ఇద్దరమూ నష్టపోతామన్న ఉద్ధేశ్యంతోనే పొత్తు తెగదెంపులు చేసుకున్నామని…….2019 ఎన్నికల సమయంలో బిజెపి-టిడిపిలు పరస్పరం విమర్శించుకుంటే……తిట్టుకుంటేనే ఇద్దరికీ లాభమని అమిత్ షాకు చెప్పాడు సుజనా చౌదరి. 2019ఎన్నికలు అయ్యే వరకూ విభేదాలు కొనసాగిద్దామని…….ఎన్నికలయ్యాక మాత్రం రాష్ట్రానికి ఏవో కొన్ని ప్యాకేజీల్లాంటివి మీరు ప్రకటించండి……..వెంటనే మేం పొత్తుకు సై అంటాం అన్నది టిడిపి చెప్పిన మాటగా బిజెపి వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఎన్నికల వరకూ మాత్రం చంద్రబాబుకు బద్ధ శతృవు మోడీ అన్న ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళాలని బిజెపి అగ్రనేతలకు 2019ఎన్నికల వ్యూహాన్ని వివరించారు. ఇక నుంచీ ఇదే డ్రామా గొప్పగా కంటిన్యూ అవుతుందనడంలో సందేహం లేదు. 2014ఎన్నికల్లో కెసీఆర్‌ని తిట్టి……ఆ తర్వాత అదే కెసీఆర్‌తో తన స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్మక్కయి హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఉన్న హక్కులతో సహా , విభజన పంపకాల అన్నింటి విషయంలో సీమాంధ్రకు ఏమీ దక్కకుండా చేస్తూ కెసీఆర్‌కి సహకరించాడు చంద్రబాబు. అదే స్టైల్‌లో ఇప్పటి నుంచీ 2019ఎన్నికల వరకూ కూడా మోడీని తిడుతూ రాజకీయం చేస్తాడు. ఎన్నికలయ్యాక మాత్రం షరా మామూలుగా మోడీతోనే కలుస్తాడు అన్నది నిజం. మరి ఎన్నికల ఏడాదిలో అధికారం కోసం, ప్రజలను మాయ చేయడం కోసం చంద్రబాబు అనుసరించే శతృత్వ-మిత్రత్వ డ్రామాలను ప్రజలు 2019 ఎన్నికల్లో కూడా నమ్ముతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -