Friday, April 26, 2024
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. మాజీ ప్రధాని కూతురు!

- Advertisement -

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టి.ఆర్.ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సమాధి వద్దకు వెళ్లి ఆమె నివాళులు అర్పించారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. పీవీకి సరైన గౌరవం ఇవ్వాలంటే వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని కోరారు. ఇతర పార్టీలు అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నివాళులు అర్పించిన అనంతరం వాణీదేవి ప్రగతి భవన్​ వెళ్లి.. ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయ్యారు. నామినేషన్ వేసినప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం చేసేలా టిఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి… సురభి వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్థులను విరమించుకొని సహకరించాలని మిగతా పార్టీలను కోరారు.

రేవంత్‌రెడ్డితో నాకు విబేధాలు లేవు..!

తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించిన నటి!

తెలంగాణా కి మొదటి స్థానం.. గర్వంగా మంత్రి ప్రకటన..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -