Friday, April 26, 2024
- Advertisement -

అలా చేస్తే కే‌సి‌ఆర్ కు ముప్పే ?

- Advertisement -

తెలంగాణ లో టి‌ఆర్‌ఎస్ కు ఉన్న క్రేజ్ ఏ ఇతర పార్టీలకు లేదనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి కే‌సి‌ఆర్ నాయకత్వనా టి‌ఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. తెలంగాణ పేరుతో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినప్పటికి టి‌ఆర్‌ఎస్ ను మాత్రమే ప్రజలు ఆకళింపు చేసుకున్నారు. మరి ఇంతటి ఘన చరిత్ర ఉన్న టి‌ఆర్‌ఎస్ పార్టీ పేరు కనుమరుగయ్యే అవకాశం ఉందా అంటే అవుననే వాదన బలంగానే వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా టి‌ఆర్‌ఎస్ పార్టీ అద్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొంది సత్తా చాటుతున్నాయి. ఇక ఏ ఇతర పార్టీలు కూడా కేవలం ప్రాంతీయ పార్టీలుగానే బలం చాటుకుంటున్నాయి తప్పా , జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో పూర్తిగా విఫలం అవుతున్నాయనే చెప్పవచ్చు. .

అందువల్ల జాతీయ స్థాయిలో సత్తా చాటెందుకు సి‌ఎం కే‌సి‌ఆర్ గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతిఒక్కరికి వచ్చే కమాన్ డౌట్.. కే‌సి‌ఆర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ నే జాతీయ పార్టీగా ప్రకటిస్తారా ? లేక జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతారా ? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ టి‌ఆర్‌ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా ప్రకటిస్తే.. ఇతర రాష్ట్రాల ప్రజలు టి‌ఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ పార్టీగానే చూస్తారు. అందువల్ల జాతీయ స్థాయిలో టి‌ఆర్‌ఎస్ పార్టీ ప్రభావం చూపలేకపోవచ్చు. అలా కాకుండా జాతీయ పార్టీగా మరో కొత్త పార్టీ పెడితే టి‌ఆర్‌ఎస్ పార్టీ సంగతేంటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం భారత్ రాష్ట్రీయ సమితి అంటే పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయించే ఆలోచనలో కే‌సి‌ఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన స్పష్టమైన సమాచారం లేనప్పటికి రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ లో విలీనం చేస్తారా ? అనే కొత్త చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే కే‌సి‌ఆర్ పై తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే టి‌ఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు రాష్ట్రానికి గుర్తుగా భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్ లో విలీనం చేస్తే కే‌సి‌ఆర్ రాజకీయ జీవితనికి తెలంగాణలో పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. మరి కే‌సి‌ఆర్ జాతీయ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Also Read

1.జగన్ కు గోల్డెన్ ఛాన్స్ ?

2.చంద్రబాబు ఇలా చేసి చూడు

3.బీజేపీ టార్గెట్ ఏపీనే ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -