Friday, May 10, 2024
- Advertisement -

చిరంజీవి అల్లు అరవింద్ పరువు తీసేస్తున్న పవన్

- Advertisement -

టీడీపీని నేనే గెలిపించాను. జగన్ బారి నుంచి ఆ పార్టీని నేనే కాపాడాను. నేను లేకపోతే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కేది కాదు. నా బలంతోనే ఆ పార్టీ అధికారం చేపట్టింది. అంటూ కొద్ది రోజులుగా తెగ ప్రచారం చేసుకుంటూ తన డప్పు తానే కొట్టుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి టీడీపీ నేతలు దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ గొప్పలు హనుమంతుడి ముందు కుప్పిగంతులు మాదిరిగా ఉన్నాయని తీసి పారేస్తున్నారు టీడీపీ నాయకులు. నా వల్లే ఈ సమస్త జగానికి వెలుగు అని మిణుగురు పురుగు సంబరపడిపోయినట్టు పవన్ తీరు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ ఆనందం కోసం సొంత డబ్బా కొట్టుకుంటే తమకేమీ నష్టం లేదు కానీ, నేను బలవంతులకే బలవంతుడుని. నేను కనుసైగ చేస్తే చాలు, ప్రజలు ఓట్లు కుమ్మరించేస్తారు. నేను వద్దంటే చాలు ఓడించే్స్తారు…నా వల్లే టీడీపీ గెలిచింది అని గొప్పలు చెప్పుకుంటే జనం నవ్విపోతారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ వల్లే 2014లో టీడీపీ గెలిస్తే, మరి అంతకుముందు 2009లో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయావని సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తున్నారు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా నాడు పవన్ ఏం వెలగబెట్టారని నిలదీస్తున్నారు. ప్రజారాజ్యానికి అన్న, యువరాజ్యానికి తమ్ముడు అధ్యక్షులుగా ఉండి ఎందుకు గెలవలేకపోయారని, ఆ పార్టీని ఎందుకు అధికారంలోకి తేలేకపోయారని టీడీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు జనసేన నుంచి సమాధానం చెప్పే నాయకులే కరువయ్యారు. పైగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి తన సొత్త అత్తగారి ఊరు పాలకొల్లులోనే ఓడిపోయారని, ఆ ఊరితో ఎంతో అనుబంధముందని చెప్పుకునే మెగా ఫ్యామిలీకి అక్కడ జీవితాంతం మరిచిపోలేని ఓటమి ఎందుకు వచ్చిందో పవన్ చెబితే బాగుంటుదని ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళ చేతిలో చిరంజీవి ఓటమికి ఏం కారణం చెబుతారని నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన పవన్ బావ అల్లు అరవింద్ ఎందుకు ఓడిపోయారో కూడా పవనే సెలవిస్తే బాగుంటుందని ప్రశ్నిస్తున్నారు.

సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో అన్నను, అనకాపల్లిలో బావను గెలిపించుకోలేకపోయిన పవన్ టీడీపీ నా వల్లే గెలిచింది. నేనే తోపును, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అని ఊహల ప్రపంచంలో విహరించడం మానుకోవాలని సూచిస్తున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్ ఘోర పరాజయాన్ని జనం మరిచిపోతున్నా, అస్తమానూ పవన్ నాటి ఘటనలను గుర్తు చేస్తున్నారని, ప్రజారాజ్యంలా నా పార్టీ ఉండదు. నేను మా అన్నలా చేయను, అంటూ పదే పదే ఆ చేదు జ్ఞాపకాలను చిరంజీవికి, అల్లు అరవింద్ కి గుర్తు చేసి పవన్ వారి పరువు తీసేస్తున్నాడని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. నిజమే కదా..సొంత కుటుంబీకులనే గెలిపించుకోలేని పవన్ తన వల్లే వాళ్లు గెలిచారు, వీళ్లు గెలిచారు. అని చెప్పుకుంటే నమ్మేదెవరు ? లాజిక్కే కదా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -