Wednesday, May 8, 2024
- Advertisement -

మంత్రి అచ్చెన్నాయిడి వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మా.. అప్ర‌మ‌త్త‌మైన వైసీపీ

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం చివ‌రికి చేరింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన‌ప్ప‌టినుంచి ప్ర‌చారాన్ని ఇరు పార్టీలు ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతూ…ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది. టీడీపీ ఇలా బ‌రితెగించ‌డం ఎప్పడు చూడ‌లేద‌ని నంద్యాల వాసులు భ‌య‌ప‌డుతున్నారు. కోట్ల రూపాయ‌లు విలువైన మ‌ద్యాన్ని టోకెన్ల ద్వారా అందిస్తున్నారు.

ఉప ఎన్నిక‌లో వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని తేలిపోవ‌డంతో దాన్ని అడ్డుకొనేందుకు కుట్ర‌ల‌కు తెర‌లేపుతోంన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఓట‌ర్ల‌ను డ‌బ్బుల‌తో కొన‌డం, ఓట‌ర్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేయ‌డం. టీడీపీకి ఓటు వేయ‌క‌పోతె రేషన్ కార్డుల‌ను తీసేస్తాం అని ప్ర‌జ‌ల‌ను బ‌హిరంగంగా బెదిరిస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిగా ఎన్నిక‌ను జ‌ర‌గ‌కుండా అపేందుకు వైసీపీ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని రెండు రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్య‌ఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి.

అందుకే నంద్యాల ప్ర‌జ‌లు, వైసీపీ నాయ‌కులు అప్ర‌మ‌త్త‌య్యారు. ఇప్ప‌టికే నంద్యాల అంతా టీడీపీ గుండాల‌ను దింపి అల్ల‌ర్ల‌కు ప్లాన్ చేస్తోంద‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. బాల‌కృష్న ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచ‌డం చూశాం. డ‌బ్బులు పంచ‌డం, బెదిరింపులు అన్నీ అయిపోయాయి. చివ‌ర‌కు మిగిలింది అల్ల‌ర్లే.

టీడీపీ రౌడీ మూక‌ల‌తో అల్ల‌ర్లు, దాడులు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని వైసీపీ అనుమానం వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదు చేసింది. ప్ర‌జ‌లు త‌మ ఓటును నిర్భ‌యంగా వినియేగించుకోవాల‌ని చెప్తున్నారు నేత‌లు. మ‌రి ముందు మందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో. వైసీపీ అప్ర‌మ‌త్తంగా లేక‌పోతె మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -