Saturday, May 25, 2024
- Advertisement -

సుమారు గంటన్నర పాటు ఆదృశ్యం అయిన రేవంత్ రెడ్డి…

- Advertisement -

తెలంగాణా టీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి అసమ్మతి నేత రేవంత్‌రెడ్డి సైతం హాజరుకావడంఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ ఖండువా క‌ప్పుకోవ‌డం దాదాపు క‌న్ఫ‌మ్ అయింద‌నె చెప్పాలి.

అయితె ఇంటి పార్టీ ఆఫీస్‌కు బ‌య‌లు దేరిన రేవంత్ రెడ్డి గంటన్నరపాటు ఏమయ్యారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరుతున్నారన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది.

ఉదయం పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన రేవంత్ రెడ్డి 11:30 నిమిషాలకు టీడీపీ భవన్ కు చేరుకున్నారు. ఈ గంటన్నర సేపు ఆయన ఎక్కడికి వెళ్లారన్న అనుమానాలు అందర్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఎవ‌రెవ‌రిని క‌లిశారు అనేది ఉత్కంఠ‌కు తెర‌లేపుతోంది.

రేవంత్ రెడ్డి, అతని అనుచరులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గుడికి వెళ్లామని చెబుతుండగా, కాంగ్రెస్ నేతలతో సమావేశమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. గోల్కండ హోటల్ లో కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకించే నేతలతో సమావేశమైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ నేతలకు తనతో పాటు కాంగ్రెస్ లో చేరే నేతల జాబితాను అందించినట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ పార్టీ మార్పుపై ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. త్వ‌ర‌గా ఈ ఉత్కంఠ‌కు తెర ఎప్పుడు దించుతారో రేవంత్ రెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -