Friday, May 3, 2024
- Advertisement -

ఏపీలో ఈసీ నిర్ణ‌యంతో ఊపిరి పీల్చుకున్న చంద్ర‌బాబు

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అన్ని పార్టీకు సెమీఫైన‌ల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈసీ ఇప్ప‌టికే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణా ఉంది. అయితే ఏపీలో కూడా ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి.అయితే ఈసీ మాత్రం ఉప ఎన్నిక‌లు లేవ‌ని ప్ర‌క‌టించ‌డంతో అధికార టీడీపీ పార్టీ ఊపిరి పీల్చుకుంది.

ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నిజానికి ఎక్క‌డైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలు చేస్తే.. ఆయా స్థానాల్లో ఎవ‌రూ పోటీకి దిగ‌రు. కాని చంద్ర‌బాబు మాత్రం ఆ స్థ‌నాల్లో పోటీ చేస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. ఆయా స్థానాల్లో చంద్ర‌బాబు త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా గెలిచే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో బాబు

ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో భాజాపాతో తాడోపేడోతేల్చేందుకు సిద్ధ‌మ‌య్యింది. జ‌గ‌న్ పిలుపు మేరకు కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడారు. ముందుగా వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడ్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో కంగు తిన్న బాబు నేను కూడా మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన మ‌రు స‌టి రోజే మేమే కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వ‌సం పెడ‌తామ‌ని మాట మార్చారు చంద్ర‌బాబు.

బాబు అవిశ్వ‌స తీర్మానంపై నోటీసులు ఇవ్వ‌క‌ముందే జ‌గ‌న్ త‌న ఎంపీల‌తో అవిశ్వాసంపై తీర్మానాలు ఇప్పించారు. దానిపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఒకప‌క్క తెలంగాణ ఎంపీలు, మ‌రోప‌క్క త‌మిళ‌నాడు ఎంపీల‌తో అప్ప‌ట్లో పార్ల‌మెంటులో యాగీ చేయించిన కేంద్రం.. దీనిని అడ్డు పెట్టుకుని వైసీపీ ఎంపీలు ఇచ్చిన తీర్మానంపై చ‌ర్చ‌లేకుండా చేసింది.

విసుగెత్తిన జ‌గ‌న్ త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఖాళీ అయిన ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే పోటీ చేసి వైసీపీకి గ‌ట్టిగా బుద్ధి చెబుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు .తాజాగా ఎన్నిక‌ల సంఘం వీటిపై క్లారిటీ ఇచ్చింది. ఈ స్థానాల‌కు ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. మొత్తానికి ఒక‌ర‌కంగా ఈసీ చంద్ర‌బాబుకు మేలే చేసింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అనేక స‌ర్వేలు వెల్ల‌డ‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. చంద్ర‌బాబు ఆయా స్థానాల్లో ఘోర ఓట‌మిని చ‌విచూడ‌డం ఖాయ‌మ‌ని అనేక స‌ర్వేలు వెల్ల‌డించాయి. ఈ సీ నిర్ణ‌యంతో ఆయ‌న బ‌తికి పోయార‌ని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -