Friday, April 26, 2024
- Advertisement -

టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్..!

- Advertisement -

కొద్ది రోజులుగా హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇవాళ ఉత్కంఠ వీడింది. ఆ పార్టీ ఉప ఎన్నిక అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై చర్చ జరిగింది. ఈ చర్చలో పలువురి పేర్లు వచ్చినప్పటికీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు.

అవినీతి ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కీలక నేత ఈటల రాజేందర్ ను ప్రభుత్వం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తుండడంతో ఆయనను ధీటుగా ఎదుర్కొనే నేత కోసం టీఆర్ఎస్ అధిష్టానం కొన్ని రోజులుగా అన్వేషిస్తోంది.

ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్వర్గం రవి, వకుళాభరణం, వీరేశన్, కృష్ణ మోహన్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పు కున్న ఎల్.రమణ పేర్లు వినిపించాయి. అయితే వీరందరినీ కాదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. శ్రీనివాస్ ఇప్పటికే టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా క్రియాశీలకంగా పని చేస్తుండడం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి నాయకత్వం వహించడంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపారు.

దీంతోపాటు శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం, బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయననే టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీ తరఫున అభ్యర్థిగా ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకు పోతుండగా.. తాజాగా టీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించడం తో ప్రచారం ఊపందు కోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -