Thursday, May 9, 2024
- Advertisement -

దెందులూరుకు ఆక్సిజ‌న్‌.. ‘ అబ్బ‌య్య చౌద‌రి ‘

- Advertisement -

కొత్త‌నీరు వ‌చ్చి.. పాత‌నీరును కొట్టేసిన‌ట్టుగా ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయ ప‌రిస్థితి కూడా ఇలానే మారిపో యింది. ఇన్నాళ్లుగా త‌న‌కు తిరుగులేద‌ని, త‌న‌మాట‌కు తిరుగులేద‌ని భావించిన ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు ఇక‌, త‌ట్టా బుట్టా స‌ర్దుకునే స‌మ‌యం వ‌చ్చేసింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. నూరు గొడ్ల‌ను తిన్న రాబందు కూడా ఒక్క‌గాలివాన‌కు చ‌చ్చిన‌ట్టుగా.. ఎన్నో ఎన్నెన్నో ఆగ‌డాలు చేసిన చింత‌మ‌నేనికి ఒక విద్యావంతుడు, నిస్వార్థ సేవాత‌త్ప రుడు చెక్ పెట్టాడ‌ని కొనియాడుతున్నారు. వైసీపీ త‌ర‌ఫున ఎంతో మంది నాయ‌కులు దెందులూరు లో ఉన్నా.., ఎవ‌రూ చేయ‌లేని ప‌నిని ఓ న‌వ‌యువ‌కుడు చేశాడ‌ని అంటున్నారు.

నియోజ‌వ‌క‌ర్గంలో ఎమ్మెల్యే అండ చూసుకుని. .. రెచ్చిపోతున్న అనుచ‌రగ‌ణం.. భూదందాల‌కు పాల్ప‌డుతోంది. ఇటీవ‌ల పేద వ‌ర్గాల‌కు చెందిన భూముల‌ను, ఇళ్ల‌ను దౌర్జ‌న్యంగా లాక్కుంటుంటే.. కొఠారు అడ్డుప‌డి.. వారికి ర‌క్ష‌ణ క‌ల్పించారు. అదేవిధంగా స్థానికంగా ప్ర‌తి ఇంటికీ తిరుగుతూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా వ‌రుస‌గా గెలుస్తున్నా.. కూడా ఎమ్మెల్యే చింత‌మ‌నేని త‌మ‌కు ఏమీ చేయ‌లేద‌ని ఇక్క‌డి వారు ఆయ‌న‌కు ఏక‌రువు పెట్టారు. ఈ క్ర‌మంలోనే వారికి తాను అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని, ఎవ‌రూ అధైర్యం చెంద‌వ‌ద్ద‌ని కొఠారు ధైర్యం చెప్పారు. చెప్పిందే త‌డ‌వుగా.. స్థానికంగా జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై ఆయ‌న‌పై ఉద్య‌మాల‌కు తెర‌దీశారు.

ఈ క్ర‌మంలోనే ఉచిత ఇసుక దందాలు, పోల‌వ‌రం మట్టి దందాలు, భూక‌బ్జా వంటి కీల‌క అంశాల‌ను అజెండాగా చేసుకుని ఎమ్మెల్యేపై పోరు బాట‌కు రెడీ అయ్యారు. నిజానికి ఇన్నేళ్ల‌లో తాము ఇలాంటి నాయ‌కుడిని చూడ‌లేద‌ని, అందునా చింత‌మ‌నేని వంటి వ్య‌క్తిని ఎదుర్కొనేంద‌కు రెడీ కావ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింద‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు అండ‌గా నిలిచేందుకు కొఠారు ఏ కార్య‌క్ర‌మం పెట్టినా వెళ్లేందుకు క్యూ క‌ట్టారు. ఫ‌లితంగా రెండు రోజుల కింద‌ట కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ప్రారంభించిన దీక్ష‌కు సంఘీభావంగా మ‌హిళ‌లు, వృద్ధులు సైతం త‌ర‌లి వ‌చ్చి ఆయ‌న ప్రారంభించిన దీక్ష‌లో భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ఆయ‌న‌కు జైకొట్టారు.

త‌మ‌కు అండ‌గా నిలిచిన నేత ఎంత దూరం వెళ్లినా.. తాము కూడా ఆయ‌న వెంటే న‌డుస్తామ‌ని వారు అంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన చింత‌మనేని.. అనుచరులు క‌లుగుల్లోకి ఎలుక‌లు వెళ్లిపోయిన‌ట్టు.. పారిపోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి దెందులూరుకు కొఠారు కొత్త ఊపిరులు ఊదార‌ని, కొత్త ఆక్సిజ‌న్ అందించార‌ని అంటున్నారు స్థానికులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -