Wednesday, May 8, 2024
- Advertisement -

వైసీపీకి పెద్ద షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే..?

- Advertisement -

నంద్యాల పరజయంతో.. వైసీపీ షాకులు తగులుతున్నాయి. అధికార పార్టీ రాబోయే ఎన్నికలలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీ బలహీనంగా కనిపిస్తున్న స్థానాల్లో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేలు 21 మంది టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో వైసీపీ వికెట్ కూడా ప‌డేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గం ఒకప్పుడు టీడీపీ కి కంచుకోటలాంటిది. స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు ఏకంగా ఐదుసార్లు గెలిచారు.. ఆ తర్వాత 2004 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా నిలబెట్టుకోలేక పోతుంది.. కోడెల కూడా రెండు సార్లు ఇక్కడ ఓడిపోయారు.. దాంతో కోడెల ఇక్కడ గెల‌వ‌న‌న్న సందేహంతో.. స‌త్తెన‌ప‌ల్లికి మారి అక్క‌డ నుంచి స్వ‌ల్ప మెజార్టీతో గెలిచారు. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో 16 వేల ఓట్ల భారీ తేడాతో విజ‌యం సాధించారు. దీంతో చంద్రబాబు ఇక్కడ ఒక పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం.. టీడీపీ జెండా ఎగురవేయాలని ఉద్దెశంతో గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకు అప్పగించిన‌ట్టు స‌మాచారం. బాబు స్కెచ్ తో య‌ర‌ప‌తినేని గోపిరెడ్డిని టీడీపీలోకి తీసుకువ‌చ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇంకా గోపిరెడ్డి కూడా టీడీపీలోకి వ‌చ్చేందుకు మొగ్గుచూపుతున్నారని సమాచారం.

అయితే వైసీపీలో చేరిన మాజీ మంత్రి కాసు వెంక‌ట కృష్ణారెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేష్‌రెడ్డిని జ‌గ‌న్ గుర‌జాల ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు.. అయితే న‌ర‌సారావుపేట త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మ‌హేష్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేస్తానని జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నెపథ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల వేళ గోపిరెడ్డిని ప‌క్క‌న పెట్టే అవకాశం ఉంది కాబట్టి.. గోపిరెడ్డి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం టీడీపీలోకి వ‌చ్చేందుకు ఇష్టంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -