వైసీపీ ఎంపి లు vs వైసీపీ ఎమ్మెల్యేలు.. జగన్ వద్దకు పంచాయితీ..!!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కొత్త వారిని నిలబెట్టినా కూడా జగన్ పై నమ్మకం తో, చంద్రబాబు పై అపనమ్మకంతో చాలామందిని ప్రజలు కళ్ళు మూసుకుని వేలిపించారు. ముఖ్యంగా ఎంపీ లలో చాలామంది కొంతమేరకే రాజకీయ అనుభవం ఉన్నారు.. ప్రస్తుతం 22 మందిలో సగానిపై పైగా జగన్ పేరు చెప్పుకుని గెలిచారు అన్నది వాస్తవం.. ఇది ఆ ఎంపీలు లు సైతం ఒప్పుకుంటారు. అయితే చాల సందర్భాల్లో ఈ ఎంపీలు తెరపైకి రాలేదు.. వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు.. కరోనా వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా  ఎమ్మెల్యే లు బయటకి వచ్చారే తప్పా ఎప్పుడు ప్రజలను పరమర్శించలేదు.. 

రోజు కో పథకం జగన్ అమలుపరుస్తున్న ఎక్కడ వాటి ప్రారంభోత్సవంలో కనిపించలేదు.. విజయ సాయి రెడ్డి లాంటి ఒక్కరిద్దరు తప్పా అందరు తమ తమ వ్యాపారాలను చూసుకున్నారే తప్పా బయట ఏనాడు కనిపించలేదు.. ఇక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రెబల్ గా మారి హల్చల్ చేస్తున్నాడు.. దాంతో అతనిపై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది ఢిల్లీ లో కనిపించరు తప్పా పెద్దగ బయటకు రాలేదు.. అయితే దీనికి కారణం ఎమ్మెల్యే లు అంటున్నారు ఎంపీల సన్నిహితులు..

- Advertisement -

నియోజక వర్గంలో జరిగే కొన్ని పనులకు తమకు ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానం అందడం లేదని ఫిర్యాదులు ఇప్పుడు వారు ఎక్కువగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తాము వస్తే ప్రొటోకాల్ పాటించాల్సి వస్తుందని కనీసం ఆహ్వానాలు కూడా పంపడం లేదని వారు చెబుతున్నారు. దీనిపై జగన్ కి ఫిర్యాదు చేయాలనీ అనుకున్నట్లు సమాచారం..  ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తమకు దూరంగా పెట్టడంపై వారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు జగన్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీలు కొందరు రెడీ అవుతున్నారు. పూర్తి ఆధారాలతో తమను ఎమ్మెల్యేలు ఎలా అవమానించారో వారు జగన్ ఎదుట చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరి జగన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...