Friday, March 29, 2024
- Advertisement -

కేబినెట్ పదవుల చిచ్చు చల్లార్చడంపై జగన్ దృష్టి

- Advertisement -

వైసీపీలో రేగిన కేబినెట్ పదవుల చిచ్చు చల్లార్చడంపై జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. అసంతృప్తి నేతలను బజ్జగించేందుకు కీలక పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. తనకు మరోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న బాలినేని పిలిపించుకుని మరీ జగన్ మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. సీఎంతో భేటీ తర్వాత బాలినేని చల్లబడినట్లు సమాచారం. అయితే బాలినేనికి కీలక పదవి కట్టబెడతానంటూ ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చినట్లు సమాచారం.

సీఎం జగన్ ఈ నెల 22న ఒంగోలులో పర్యటించనున్నారు. నవరత్నాల్లో భాగంగా సున్నావడ్డీ పథకం కింద మూడో ఏడాది డ్వాక్రా మహిళల ఖాతాలకు ఆ రోజు నగదు విడుదల చేస్తారు. తాజా మాజీ మంత్రి బాలినేని చొరవతో గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ వద్ద ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని సైతం అదే రోజు జగన్ ప్రారంభిస్తారు. బాలినేనికి కీలక పదవి ఇస్తున్నట్లు ఆ రోజే ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతేడాది అక్టోబరు 6న సీఎం ఒంగోలులో పర్యటించారు. అప్పుడు ‘ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. జిల్లాల విభజన తర్వాత ఇక్కడకు రానుండటం ఇదే తొలిసారి. దాంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రమాణస్వీకారానికి కొందరు డుమ్మా

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

-Anjanreddy Kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -