Thursday, April 25, 2024
- Advertisement -

కాంగ్రెస్ కు పెను సవాల్ గా మారిన మునుగోడు వ్యవహారం !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు చుట్టూ టి‌ఎస్ ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో మునుగోడు పట్టు సాధించేందుకు టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉవ్విళ్లూరుతోంది. గత కొన్నేళ్లుగా మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉంది. ఇక్కడ ఆరు సార్లు కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1967,1972,1978,1983, 1999 సంవత్సరాలలో దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరుపున తిరుగులేని విజయాలను నమోదు చేశారు.

ఇక ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరుపున కూడా మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని మరొకసారి రుజువైంది. అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు టాటా చెప్పి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కు పెద్ద దేబ్బే తగిలిందని చెప్పాలి. ఇక రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ పార్టీకి మునుగోడు నియోజిక వర్గం సిట్టింగ్ స్థానం కావడంతో..కచ్చితంగా ఆ స్థానాన్ని నిలుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరి గతంలో కాంగ్రెస్ తరుపున మునుగోడు నియోజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరుపున బరిలోకి దిగుతుండడంతో.. మరి కోమటిరెడ్డిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మునుగోడు పై ఏమాత్రం పట్టులేని టి‌ఆర్‌ఎస్ కూడా ఈ ఉపఎన్నికపై గట్టిగానే ఫోకస్ చేసేలా కనిపిస్తోంది. ఈ ప్రధాన పార్టీలు మాత్రమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ అయిన CPI కి కూడా మునుగోడుపై బలమైన రికార్డే ఉంది. ఇక్కడ సి‌పి‌ఐ అభ్యర్థులు 5 సార్లు విజయం సాధించారు. దీంతో మునుగోడుపై సి‌పి‌ఐ కూడా గట్టిగానే దృష్టి సాధించే అవకాశం ఉంది. ఈ విధంగా మునుగోడు చుట్టూ ఇంత టాఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.

Also Read

మోడీజీ.. డీపీ మారిస్తే దేశభక్తి పెరుగుతుందా ?

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ?

కే‌సి‌ఆర్ రహస్య ప్రయాణం.. ఎన్నో ప్రశ్నలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -