Friday, May 10, 2024
- Advertisement -

పవన్ను తక్కువగా అంచనా వేసిన జగన్..!

- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సస్ జనసేనగా మారిపోయాయి. విశాఖ ఘటన తరువాత అందరి చూపు జనసేనపై పడింది. వైసీపీ అధినేత జగన్ కూడా ఇన్నాళ్ళు పవన్ను తక్కువగా అంచనా వేసినప్పటికి విశాఖ ఘటనతో అంచనాలన్నీ తారుమారయ్యాయి. సాధారణంగా వైఎస్ జగన్ కేవలం చంద్రబాబును మాత్రమే రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ తరచూ ఆయనపై మాత్రమే విమర్శలు చేస్తూ ఉంటారు. పవన్ను మాత్రం పెద్దగా పెట్టించుకునే వారుకాదు గతంలో. దాంతో పవన్ చపాకింద నీరులా జనసేనను క్షేత్ర స్థాయిలో బలపరుస్తూ ప్రజల్లో తన ప్రత్యేకత ఏంటో తెలియజేస్తూ వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పవన్ చూపిన చోరువ.. ఒకరకంగా చంద్రబాబు కూడా చూపలేదనే చెప్పాలి.

రోడ్ల విషయంలో గాని, ప్రజా సమస్యలపై గొంతుక వినిపించడంలో గాని పవన్ ప్రజల దృష్టి ని గట్టిగానే ఆకర్షించారు. ఇక కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయినప్పటికి.. పవన్ తన సొంత డబ్బుతో కౌలు రైతులను ఆధుకున్నారు. దీంతో ” పవన్ రావాలి.. పాలన మారాలి .. ” అనే నినాదం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. దాంతో ఇన్నాళ్ళు చంద్రబాబును మాత్రమే ప్రత్యర్థిగా భావించిన జగన్ కు పవన్ పంటికింద రాయిలా మారాడు. అసలే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు జగన్.. దీంతో పవన్ మ్యానియా ఇలాగే కంటిన్యూ అయితే వైసీపీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. అందుకే జగన్ ప్లాన్ మార్చి జనసేన ఎదుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈ మద్య పవన్ పై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే గతంలో పవన్ పై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. పవన్ మాత్రం చాలా కంట్రోల్ గా విమర్శలు చేసేవారు. కానీ విశాఖా ఘటన తరువాత మంగళగిరిలో పవన్ మాట్లాడినా భాష విధానం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టించింది. ఓకరకంగా పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేనకు మంచి మైలేజ్ తెచ్చాయనే చెప్పాలి. ఇక ఇదే పద్దతి పవన్ కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో వైసీపీ కి బలమైన ప్రత్యర్థిగా జనసేన నిలిచే అవకాశం కూడా లేకపోలేదు. మరి పవన్ను.. జగన్ ఎంతవరకు నిలువరిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ భూతుపురాణం.. అసలు వ్యూహామేంటి ?

రాహుల్ వ్యూహం ఫలించిందా ?

చంద్రబాబు చాణక్యం.. పవన్ కు కలిసొస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -