Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. రాహుల్ వ్యూహం ఫలించిందా ?

- Advertisement -

గతకొంత కాలంగా కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో తర్జన భర్జన పడుతోంది ఆ పార్టీ అధిష్టానం. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ నేతలంతా భావించారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టేందుకు విముఖత చూపించారు. దాంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడి రేస్ లో ముందుగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్దంగా లేకపోవడంతో అశోక్ గెహ్లాట్ ను పక్కన పెట్టేసింది కాంగ్రెస్ అధిష్టానం.

ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి “ఒకరికి ఒకే పదవి.. ” అనే సూత్రాన్ని పాటిస్తూ వస్తోంది. దాంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థారూర్ పోటీలో నిలిచారు. ఇక తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కేవలం గాంధీ కుటుంబమే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల తరువాత గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నిలవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరో తేలిపోవడంతో ఆపార్టీ తరుపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఒక్కడే ఉంటాడనే చెప్పవచ్చు.

ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకే రాహుల్ అధ్యక్ష పదవిని వీడిన సంగతి తెలిసిందే. దాంతో పార్టీ అంతర్గత బాధ్యతలపై ఒత్తిడి పెంచుకోకుండా రాహుల్ పూర్తిగా వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెల్లే అవకాశం ఉంది. ఇక రాహుల్ చేపట్టిన ” జోడో యాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ముందు చాలానే సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీలోని నేతలలో అంతర్గత విభేదాలు గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గే పార్టీలోని సమస్యలను ఎలా సమన్వయ పరుస్తారనేది ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి

పవన్ భూతుపురాణం వెనుక.. అసలు వ్యూహమేంటి ?

జగన్ కు పెను సవాల్ గా రోడ్ల సమస్య.. ఎన్నికల్లో భారీ మూల్యం తప్పదా ?

తెలంగాణలో మరో బైపోల్.. ఈటెల వ్యూహాలు ఫలిస్తున్నాయా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -