Monday, April 29, 2024
- Advertisement -

జేసీ ఇల‌కాలో జ‌గ‌న్ స‌భ‌కు పోటెత్తిన జ‌నం…

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర అనంత‌పురంలో దిగ్విజ‌యం కొన‌సాగుతోంది. అదికూడా జేసీ బ్ర‌ద‌ర్స్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రాండ్ స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పాలి. క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లో కంటె అనంత‌పురంలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సాదార‌నంగా అనంత‌పురంలో వైసీపీకి ప‌ట్టు ఏమాత్రం లేదు. 2014 ఎన్నిక‌ల్లో 14 నియోజ‌క వ‌ర్గాల‌కు గాను రెండిటిలో మాత్ర‌మే గెలిచింది.ఇద్ద‌రిలో కూడా ఒక‌రు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జేసీ ఇల‌కాలో పాద‌యాత్ర‌కు జ‌నాలు వ‌స్తారా రారా అనే సందేహం ఉండేది. కాని అనుకున్న దానికంటె గుత్తి ప్రాంతంలో కూడా జనసమీకరణ బాగానే జరిగినప్పటికీ తాడిపత్రి బహిరంగసభకు హాజరైన జనాలు మాత్రం మామూలుగా లేరు. ఈ నియోజకవర్గంలో పార్టీలతో పనిలేకుండా దశాబ్దాల తరబడి జెసి సోదరులదే హవా నడుస్తోంది. పార్టీ తరపున పోటీ చేసినా, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా గెలుపు మాత్రం వాళ్ళదే. తాడిపత్రిలో వారిని ఎదిరించి ఇంకోరు నిలబడటమన్నది ఊహకు కూడా అందదు.

అటువంటి నియోజకవర్గంలో వైసిపి చేసిన జనసమీకరణ మామూలు స్ధాయిలో లేదు. దశాబ్దాల పాటు జెసి సోదరుల హవా నడుస్తోందంటే వారికి ధీటైన నాయకుడు అక్కడ లేకపోవటమే. అందుకే ఎన్నికేదైనా అక్కడ ఫలితం మాత్రం ఏకపక్షంగా వస్తోంది. గడచిన మూడున్నరేళ్ళలో జెసి సోదరులపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగిపోతోంది. దానికితోడు తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ పెద్దారెడ్డిని నియమించారు. దాంతో సమీకరణలు మారుతున్నాయి. పెద్దారెడ్డి ఏ విషయంలో కూడా జెసి సోదరులకు తీసిపోని నేతగా ప్రచారంలో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -