Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీ నేత‌ల‌కు ఇంకా ఆశ చావ‌ట్లేదుగా..?

- Advertisement -

ఏపీలోనే కాకుండా దేశంలో కూడా ఫిరాయింపు రాజ‌కీయాల‌కు కొదువ‌లేదు. ఫిరాయింపుల‌కు అన్ని పార్టీలు సిద్ధ‌మే కానీ వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటే మాత్రం ఎవ్వ‌రూ స్పందించ‌రు. ఒక పార్టీలో గెలిచిన నేత‌లు ప‌ద‌వుల‌కోసం ఇత‌ర పార్టీలోకి వెల్తే వారిపై అన‌ర్హవేటు వేయాల‌ని రాజ్యాంగంలో ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. గోడ‌దూకే నేత‌ల‌పై మూడు నెల‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సాక్షాత్తు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడే సెల విచ్చారంటే మ‌న స్పీక‌ర్ వ్య‌వ‌స్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడాల్సిన స్పీక‌ర్ వ్య‌వ‌స్థ అధికార‌పార్టీకీ తొత్తుగా మారింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇక ఏపీలో మాత్రం ఫిరాయింపులు మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్లు సాగుతోంది. కాంట్రాక్టులు, మంత్రి ప‌ద‌వుల‌కోసం న‌మ్మిన ప్ర‌జ‌ల‌ను, పార్టీనీ గాలి కొదిలేద‌సి త‌మ స్వార్థ లాభాల‌కోసం ఎమ్మెల్యేలు గోడ దూక‌డం సిగ్గుచేటు. అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్ర‌బాబు నిస్సిగ్గుగా ఫిరాయింపు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. సంత‌లో ప‌శువుల్లాగా ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు పెట్టి వైసీపీనుంచి 24 మంది ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. అంతే కాకుండా వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడాల్సిన గ‌వ‌ర్న‌రే ఫిరాయింపు నేత‌ల‌తో మంత్రులుగా ప‌ర‌మాణ స్వీకారం చేయించారు.

పార్టీ ఫిరాయించిన నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీ అనేక సార్లు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితంలేదు. కోర్టుకు వెల్లినా ఫ‌లితం శూన్యం. దాంతో అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది వైసీపీ. ఇక ప్ర‌జ‌ల్లోనే తేల్చ‌కుంటామ‌ని ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. తాజాగా రేప‌టినుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని వైసీపీకీ స్పీక‌ర్ కోడెల లేఖ రాశారు.

లేఖ‌లో ఫిరాయించిన నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేటు వేస్తే వెంట‌నే స‌మావేశాల‌కు హాజ‌రు అవుతామ‌ని తెలిపారు వైసీపీనేత‌లు. వీరి పిచ్చిగాని గ‌త నాలుగు సంవత్స‌రాలుగా ఫిరాయింపుల‌పై చ‌ర్య‌లు తీసుకోని స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌గారు… ఇప్పుడు వారిమీద చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది వైసీపీ నేత‌ల ఆశ‌కు ప‌రాకాష్ట. అసెంబ్లీ స‌మావేశాల‌పై ఇంకా వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఆశ చావ‌ట్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -