Thursday, May 9, 2024
- Advertisement -

బాబు, పవన్‌లతో సహా ఏ ఇతర నాయకుడైనా జగన్ స్థాయిలో ప్రజల మధ్య ఉండగలరా?

- Advertisement -

ట్విట్టర్ నాయకుడు పవన్ కళ్యాణ్, మాటలు, రాజకీయ వ్యూహాల నాయకుడు చంద్రబాబుకు సవాల్…..ఇంకా కమ్యూనిస్టు నాయకులు, విభజనతోనే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్న కొద్దిమంది నాయకులకు కూడా ఛాలెంజ్……. వైఎస్ జగన్‌లాగా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండగలరా? ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న జగన్……. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచీ బస్సు యాత్ర కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే విశ్రాంతి అన్నదే లేకుండా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పవన్, చంద్రబాబు, కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రస్ నాయకులు జగన్‌లా ప్రజల మధ్యన ఉండగలరా? ఇప్పుడు ఇదే సవాల్‌ను సోషల్ మీడియా వేదికగా జగన్ అభిమానులు సంధిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ల అభిమానులు సమాధానం చెప్పగలరా?

ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పుకునే ఏ నాయకుడికైనా ముందుగా ప్రజలతో మమేకం కావడం తెలియాలి. కోటాను కోట్ల రూపాయలు, బెంజ్ కార్లు ఉన్నప్పటికీ ప్రజలతో పాటే కాలినడకన ప్రయాణించే సత్తా ఉండాలి. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునే ప్రయత్నం ఎఫ్పుడూ చేస్తూ ఉండాలి. అనుక్షణం ప్రజల మధ్య ఉండడానికి, వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళ కోసం దీక్షలు, పోరాటాలు చేయాడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడివే విషయాలను పవన్, చంద్రబాబుల ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేశాడు పవన్. కానీ గత రెండేళ్ళలో మాత్రం ఇతర తెలుగు స్టార్ హీరోలందరికంటే ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశాడు. ఈ మూడున్నరేళ్ళలో పవన్ ప్రజల మధ్యన ఉన్నది మహా అయితే పది రోజులు కూడా ఉండదు. ఇక చంద్రబాబు అయితే ప్రజల మధ్యలో ఉన్నదానికంటే విదేశాల్లోనే ఎక్కువ ఉన్నాడన్నది నిజం. వారి పుత్రరత్నం నారా లోకేష్‌ది కూడా అదే పరిస్థితి. కమ్యూనిస్టులతో సహా మిగిలి ఉన్న కాంగ్రెస్ నాయకులతో సహా అందరూ కూడా ఈ విషయంలో జగన్ కంటే చాలా చాలా తక్కువ. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న జగన్……ఆ తర్వాత సెప్టెంబర్ నుంచీ బస్సుయాత్ర కూడా తలపెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలాన్ని ప్రజలందరినీ కలిసే ప్రయత్నంలో ఉన్నాడు. వాళ్ళందరి కష్టాలను కూడా స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని వైకాపా జనాలు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. మరి జనసేనుడు, నటనాయకుడు పవన్, ప్రజాదరణ కంటే కూడా రాజకీయ వ్యూహాలు, ప్రచార పటాటోపంతోనే మనుగడ సాగిస్తున్న నారా వారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -