Saturday, April 27, 2024
- Advertisement -

ఆ వ‌ర్గాన్ని ట‌చ్ చేసిన జ‌గ‌న్‌….అధికారం వైసీపేదేనా..?

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఎన్నిక‌ల ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించనున్నాయి. ఎన్నిక‌లు టీడీపీ, వైసీపీ మ‌ధ్య‌నే ర‌స‌వ‌త్త‌ర పోరు న‌డ‌వ‌నుంది. ఏ ఎన్నిక‌ల్లో అయినా య‌వ‌త ఓట్లు కీల‌కం కానున్నాయి. యువ‌త నాడి ప‌ట్టుకుంటే గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే. వాళ్ల‌ను ట‌చ్ చేయాలంటే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.

యువ‌త మాట తప్పరు, మడమ తిప్పరు. ఒకసారి మాత్రం నమ్మి ఓటేస్తారు. మాట తప్పారో మరి ఆ వైపు చూడరు. కరెంట్ లాంటి యువతను టచ్ చేయడానికే ఆలోచించాలి. అస‌లు విష‌యానికి వ‌స్తే ఏపీలో వ‌చ్చె ఎన్నిక‌ల్లో యువ‌తే కీల‌కం కానున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో పెద్ద ఎత్తున ఉన్న యువత తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. తమకు ఉపాధి రాదా అని తల్లడిల్లారు. ఆ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు వారికి ఒక హామీ ఇచ్చారు. అనుభవం కలిగిన తనను ఎన్నుకుంటే ఏపీలో జాబ్ క్రియేట్ చేసి ఇస్తానని. జాబ్ రావాలంటే బాబు రావాలని కూడా గట్టి నినాదం ఇచ్చారు. అనుభం ఉన్న వ్య‌క్తి సీఎం అయితే ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని నిరుద్యోగ యువ‌త పెద్ద ఆశ‌లు పెట్టుకున్నారు. దానికి తోడు నిరుద్యోగ భృతి హామీ కూడా బాబుకు ఉప‌యోగ ప‌డింది.

బాబు అధికారంలోకి వ‌చ్చాకా ఏం జ‌రిందో అంద‌రికీ తెలిసిందే. ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నా వాటిని భ‌ర్తీ చేయ‌డంలో విఫ‌లం అయ్యింది. ఇప్పుడు మ‌రో సారి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈసారి బాబు మాట వినే స్థితిలో యువ‌త లేరు. యువ‌త‌ను వాడుకొని వ‌దిలేయ‌డం బాబుకు అల‌వాట‌గా మారింద‌ని అంద‌రికీ అర్థ‌మ‌య్యింది. స‌రిగ్గా దీన్నే జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రంగా మ‌లుచుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో భాగంగా జరిగిన సభలో జగన్ నిరుద్యోగులకు భారీ హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే నిరిద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తానని జగన్ చెప్పారు. అన్నీ కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని కూడా జగన్ గట్టి హామీనే ఇచ్చారు. ఇక అంతటితో ఆగకుండా ప్రతీ ఏటా ఒక షెడ్యూల్ పెట్టి జాబ్ క్యాలండర్ కూడా క్రియేట్ చేసి అప్పటికి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని జగన్ చెప్పుకొచ్చారు. మ‌రో వైపు స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చ‌ట్టం తెస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఇది నిజంగా వైసీపీకి జగన్ కి కలసి వచ్చే అంశమేనని అంటున్నారు. ఓవైపు ఏపీలో నిరుద్యోగం పెరిగిపోతోంది. మరో వైపు యువతకు జాబులు లేవు. టీడీపీ హామీ అటకెక్కింది. అదే సమయంలో జగన్ నమ్మకంగా చెప్పిన ఈ మాటను మెజారిటీ యువతరం విశ్వసించే అవకాశాలే అధికంగా ఉన్నాయ‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -