Saturday, April 27, 2024
- Advertisement -

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం..

- Advertisement -

అనుకున్నట్లే జరిగింది.. ఏపిలో అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం జగన్ చేస్తున్న సేవలకు మరోసారి ఆ పార్టీకి ఘనవిజయం దక్కేలా తిరుపతి ఉప ఎన్నిక తీర్పు చెప్పారు ప్రజలు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ఆయన 2.31 లక్షలకు పైగా మెజారిటీతో తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు.

మొదటి నుంచి దూకుడు తో వస్తున్న రిజల్ట్ చూసి గురు మూర్తి విజయం ఖాయం అనుకున్న విషయం తెలిసిందే. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి 5,33,961 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 3,02,580 ఓట్లు వచ్చాయి.

ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది. ఆ పార్టీ 50,354 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 8,406… సీపీఎంకు 4,978, ఇతరులకు 30,381, నోటాకు 13,175 ఓట్లు వచ్చాయి.

కాగా, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ నుంచి బల్లి దుర్గాప్రసాద్‌ గెలుపొందారు. గతేడాది ఆయన కరోనాతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది.

త్రివిక్రమ్-మహేష్ ముచ్చటగా మూడో సినిమా .. హిట్ పక్కా!

ఆ సినిమాల లిస్టులోకి చేరిపోయిన నాగ చైతన్య.. థాంక్యూ!

యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -