Sunday, April 28, 2024
- Advertisement -

టచ్ చేయకుండానే.. మెస్మరైజింగ్ మ్యూజిక్

- Advertisement -

సినిమాల్లో గాని ఎక్కడైనా గాని.. మనకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావాలంటే ఆ శబ్దాన్ని క్యాప్చర్ చేయడానికి నానా తంటాలు పడుతుంటాం. దీని కోసం సినిమా వాళ్లు రకరకాల తంటాలు పడుతుంటారు.అందుల్లోను మ్యుజీషియన్ల తంటాలు అన్నీ ఇన్నీ కావు. హార్మోనియం, వయలెన్ ,తబలాల్లాంటి వాయిద్యాలతో సంగీతకారులు కుస్తీలు పట్టేవాళ్ళు. ఫ్లూట్, గిటార్, శాక్సాఫోన్..లాంటి సాధకాలతో సంగీతాన్ని రాబట్టుకోవాలంటే నోటినిండా గాలి తీసుకుని బుగ్గలురెండూ ఊరిపోతుండేవి.

ఆ తర్వాత కాలంలో ఇన్స్ట్రుమెంట్స్ లో ఎలక్ట్రానిక్ విప్లవం పుట్టుకొచ్చి.. రిలీఫ్ నిచ్చింది. ఇప్పుడు దీనికి కూడా వచ్చిన మరో అప్డేషన్ పేరే.. తెరెమిన్. దీనిని మనం టచ్ చేయకుండానే కావాల్సినంత సంగీతాన్ని కొని తెచ్చుకునే తాజా మ్యూజికల్ సిస్టమ్. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ సిరీస్ లో ఇదీ ఒకటి. కేవలం సెన్సార్ల సాయంతోనే పనిచేస్తుంది. రెండు యాంటెన్నాలు.. నిలువు యాంటెన్నాకు చేతిని దగ్గరగా జరిపేకొద్దీ పిచ్ లో వేరియేషన్స్ కలుగుతాయి. మరో లూప్ యాంటెన్నా.. వాల్యూమ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇలా చెయ్యి తగలకుండానే పుట్టే తరంగాలతో శబ్దాన్ని జెనెరేట్ చేయడం అనేది ”ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ది తెరెమిన్”.

ఈ తరహా సంగీత సృష్టిలో ఆరితేరిన కెరొలినా లైక్.. ఇప్పుడు గ్లోబల్ సెలబ్రిటీ స్టేటస్ పొందేసింది. ఏడేళ్ల వయసు నుంచి తెరెమిన్ ఇన్స్ట్రుమెంట్ తో అనుబందం వున్న కెరొలినా.. దీనికి సంబంధించి ఒక సిలబస్ ని కూడా తయారు చేసి.. క్లాసులు పీకుతుంది. తన ప్రదర్శన లేకుండా ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగదన్న ధీమాకు వచ్చేసింది. మనిషి హ్యాండ్ లేకుండానే తెరెమిన్ ఇన్స్ట్రుమెంట్ ని రోబోలతో వాడుకోవడం మీద ప్రయోగాలు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -