Wednesday, May 15, 2024
- Advertisement -

బాబు-మోడీ అభివృద్ధి జోడీనా? ఆంద్రప్రదేశ్‌కి బోడి గుండు కొట్టిన జోడీనా?

- Advertisement -

అదిగదిగో భూలోక స్వర్గం…… ఐదేళ్ళలో భారతదేశం మొత్తం కూడా అలా ఉండడం ఖాయం…..అద్భుతః….అద్భుతస్య…..అద్భుతోభ్యః అని ఎన్నో ఆశలు కల్పించారు. మోడీ నుంచి మొదలుపెడితే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, బాబు భజన మీడియా, భజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా అందరిదీ అదే మాట. మోడీకి ఓటెయ్యండి చాలు……ఆ తర్వాత అద్భుతాలే అని చెప్పారు. మొత్తం భారతీయులందరికీ ఇదే రకమైన మాటలు చెప్పారు. తెలుగువారికి ఘనంగా చెప్పింది మాత్రం ఎల్లో బ్యాచ్‌నే. మోడీతో పాటు చంద్రబాబును కూడా గెలిపించండి. ఇద్దరూ అభివృద్ధి జోడి అన్న పల్లాయి అందుకున్నారు. ఆంద్రప్రదేశ్‌లో చంద్రబాబును గెలిపిస్తేనే భారతదేశం మొత్తాన్ని భూతల స్వర్గం చేయాలన్న మోడీ పథకంలో ఆంద్రప్రదేశ్ కూడా చేరుతుంది. పొరపాటున జగన్‌ని గెలిపించారో…….ఆ భూతల స్వర్గంలో ఆంద్రప్రదేశ్ ఉండదు అని ఢంకా భజాయించి మరీ చెప్పారు.

మోడీ అధికారంలోకి వచ్చారు. సందట్లో సడేమియాలాగా చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాడు. కానీ బాబు-మోడీ జోడి మాత్రం ఆంద్రప్రదేశ్‌కి పూర్తిగా బోడి గుండు కొట్టింది. మోడీవారు ఫస్ట్ స్ట్రోక్ ఆంద్రప్రదేశ్‌కే ఇచ్చారు. విభజన సమయంలో కాంగ్రెస్ పూర్తిగా అన్యాయం చేసింది. అలాంటి ఆంద్రప్రదేశ్‌ని ఎక్కడికో తీసుకెళ్తానన్న మోడీ పూర్తిగా గాలికొదిలేశాడు. కోలుకునే అవకాశమే లేకుండా చేసిపడేశాడు. ఓటుకు నోటు కేసుతో సహా ఎన్నో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు కూడా పూర్తిగా మోడీకి సాగిలపడిపోయాడు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అనాథలా మిగిలిపోయింది అన్న విషయం కూడా చంద్రబాబు, యనమల, టిడిపి భజన మీడియానే చెప్తూ ఉంటుంది. కాకపోతే నెలలో 29 రోజులు బ్రహ్మాండం, అద్భుతం అంటూ గ్రాఫిక్స్ చూపించి……ఆ మిగిలన ఒక రోజు మాత్రం అప్పుల్లో ఈడుస్తున్నాం, ప్యాకేజీకి కూడా దిక్కులేదు, ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అంటూ నిజాలు చెప్తూ ఉంటారు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే హోదాతో సహా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టిన చంద్రబాబే…….మళ్ళీ మోడీ ఏం చేయడం లేదని చెప్పి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయడం……

ఇక ఈ రోజు ఆంద్రజ్యోతిలో వచ్చిన కామెంట్ చదివాక ఎల్లో బ్యాచ్ అందరికీ స్పష్టత వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. అప్పట్లో మోడీ అద్భుతం అని చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లేయించిన రాధాకృష్ణనే ఇఫ్పుడు నేను కూడా బాధితుడిని అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే పనిని మొట్టమొదటిగా చేసిన వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్‌నే. అఫ్కోర్స్ చేయించిన వాడు చంద్రబాబే అనుకోండి. ఇక రేపో మాపో చంద్రబాబు కూడా అంతా మోడీనే చేశాడు…….నేను బాధితుడిని అని ప్రజల మధ్యకు వెళ్ళడం ఖాయం. ఆ రకంగా 2014 ఎన్నికల్లో మోడీకి ఓట్లేయమని చెప్పి ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించి నిండా ముంచిన బ్యాచ్ అందరూ కూడా మోడీ మోసం చేశాడు, అన్యాయం చేశాడు, మేం కూడా బాధితులం అని చెప్పి 2019 ఎన్నికలకు వెళ్తారన్నమాట…….

ఇక్కడే చంద్రబాబు గురించి జగన్ చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. ఈ సందర్భానికి కరెక్ట్‌గా సరిపోయే కథ కూడా. తల్లిదండ్రులను హత్య చేసిన ఒక కొడుకు కోర్ట్ బోనులో నిలబడ్డాడట. జడ్జ్‌గారు శిక్ష వేయబోతే……..‘తల్లీతండ్రి లేని అనాథనయ్యా…. క్షమించి వదిలెయ్యండయ్యా…….’ అని అడిగాడట. చంద్రబాబు నైజం గురించి చెప్తూ ఈ కథను జగన్ చాలా సార్లు చెప్తూ ఉంటాడు. 2014లో మోడీకి ఓట్లెయ్యండి, గెలిపించండి అని చెప్పిన బాబు, పవన్, టిడిపి భజన మీడియా సభ్యులందరూ కూడా మోడీ అన్యాయం చేశాడు, మోడీ బాధితులం మేం అని చెప్పి 2019 ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నంలో ఉండడం ఈ కథలోని బాలుడి నైజంలా లేదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -