Sunday, April 28, 2024
- Advertisement -

సొంతవారికే చంద్రబాబు షాక్!

- Advertisement -

చంద్రబాబు సొంత జిల్లాలో నమ్ముకున్న నేతలను నట్టేట ముంచారు. సామాజిక ద్రోహం చేసారు. డబ్బున్న తన సొంత వర్గానికే సీట్లు కేటాయించారు. జనసేనతో పొత్తు ఖాయం చేసుకొని తన సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లు కూడా ఆ పార్టీకి ఇవ్వలేదు. ఇక, బీజేపీలోని తెలుగు కమలం నేతలకు సీట్లు దక్కేలా చేస్తున్న రాజకీయం పై ఢిల్లీ నేతలు గుర్రుగా ఉన్నారు. జనసేనకు ఇచ్చిన 21 సీట్లలోనూ తెలుగు సైనికు లకే సీట్లు వచ్చేలా పవన్ పై ఒత్తిడి చేస్తున్నారు. పవన్ రాజకీయం అర్దం చేసుకున్న జనసేన, బీజేపీ నేతలు సరైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు 14 సీట్లలో తన వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదు. టీడీపీకి తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న మాదిగ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. బలిజ వర్గానికి కేటాయించాల్సిన చిత్తూరు స్థానం కమ్మ వర్గానికి కేటాయించారు. రెండు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు రిజర్వ్ కాగా..ఒక్క స్థానంలో మాదిగ వర్గానికి అవకాశం ఇవ్వలేదు. ఈ వర్గాల నుంచి టీడీపీ కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేసిన వారిని పూర్తిగా విస్మరించారు. పార్టీలో పని చేసిన వారిని కాదని సత్యవేడు టికెట్ వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలం కు కేటాయించటంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. జీడీ నెల్లూరులో పార్టీ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన వారిని కాదని థామస్ కు సీటు ప్రకటించారు.

చిత్తూరు సీటు ఆశ చూపి కోట్లు ఖర్చు చేసిన రాజన్ ను పక్కన పెట్టి, మూడు నెలల క్రితం వచ్చిన జగన్ మోహన్ నాయుడుకు సీటు ఇచ్చారు. మదనపల్లిలో షాజాహాన్ కు సీటు ఇవ్వటం పైన తమ్ముళ్లు మండిపడుతున్నారు. అదే విధంగా తంబళ్లపల్లిలో పార్టీ కోసం అన్ని త్యాగం చేసిన బీసీ నేత శంకర్ యాదవ్ ను కాదని పార్టీలో సభ్యత్వం కూడా లేని జయచంద్రారెడ్డికి సీటు ఇవ్వటంతో కరకట్ట వరకు వరకు శంకర్ యాదవ్ మద్దతు దారులు నిరసనలకు దిగారు. ఇలా పూర్తిగా బీసీ, మాదిగ వర్గాలను విస్మరించి ..పార్టీ కోసం పని చేసిన వారిని..కోట్లు ఖర్చు చేసిన వారిని కాదని..సొంత జిల్లాలో చంద్రబాబు నిర్ణయించిన అభ్యర్దులకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత మొదలైంది. బీసీ, మాదిగ వర్గాల్లో చంద్రబాబు పైన ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -