Wednesday, May 8, 2024
- Advertisement -

వివేక్ కు.. డిప్యూటీ సీఎం పోస్ట్!

- Advertisement -

రాజు తలుచుకుంటే… అనే ఓ సామెత తెలంగాణ సీఎం కేసీఆర్ కు అచ్చంగా సరిపోయేట్టే ఉంది. ఎందుకూ.. ఏంటి అని ఆరా తీస్తే ఓ కొత్త విషయం బయటపడింది. రీసెంట్ గా.. కాంగ్రెస్ ను వదిలి మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయిన సీనియర్ రాజకీయ నాయకులు వివేక్, వినోద్, గుత్తా సుఖేందర్ రెడ్డి.. భారీ హంగామా మధ్య కేసీఆర్ తో మెడలో గులాబీ కండువా వేయించుకున్నారు.

కాంగ్రెస్ లో గ్రూపులు భరించలేకే.. పార్టీ మారుతున్న విషయాన్ని ఆ ముగ్గురూ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యేందుకే.. టీఆర్ఎస్ లో చేరినట్టు చెప్పుకొచ్చారు. 

ఈ ముగ్గురిలో.. వివేక్ తో కేసీఆర్ కు కాస్త దగ్గరి సంబంధమే ఉంది. వాస్తవానికి టీఆర్ఎస్ లో ఉన్నపుడు వివేక్ కూడా.. ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి బాగానే పోరాడారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం.. చివర్లో తెలంగాణ బిల్లు రూపొందే ప్రక్రియలో కేసీఆర్ తో కలిసి ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో.. వివేక్ పాత్ర కూడా చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు. ఇప్పుడు.. ఆ అభిమానమే.. డిప్యూటీ సీఎం పోస్టు రూపంలో వివేక్ ను వరించనున్నట్టు… తెలంగాణ పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

వివేక్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ కూడా పెద్ద స్కెచ్చే వేశారన్న చర్చ జరుగుతోంది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి.. శాసన మండలి చైర్మన్ సీట్లో కూర్చోబెడతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు కొన్నాళ్లపాటు రెస్ట్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. సో.. ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవిని వివేక్ కు ఇస్తే.. బాగుంటుందన్నది సీఎం ఆలోచనగా కొందరు చెప్పుకుంటున్నారు. 

పాత మిత్రుడు గుత్తాకు కూడా.. హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే బాగుంటుందని సీఎం ఆలోచిస్తున్నట్టు మరో టాక్. అయితే.. ఇప్పటికిప్పుడు కాకున్నా.. అదును చూసి మరీ పదవుల మార్పిడి విషయాన్ని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా కేసీఆర్ మేనేజ్ చేసే అవకాశం కూడా ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. చూడాలి.. ఈ గుసగుసలు ఎంత వరకూ నిజమవుతాయో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -