Thursday, May 2, 2024
- Advertisement -

హిజ్రాలైతేనేం…..పురుడు పోసారు,ప్రాణాలు కాపాడారు

- Advertisement -

హిజ్రాల‌న‌గానే మ‌నం అస‌హ్యించుకుంటాం.వారి వెకిలి చేష్టలు మ‌న‌లో  విగ‌టు పుట్టిస్తాయి.దాంతో స‌భ్య స‌మాజం వారిని ఎపుడూ దూరంగా ఉంచుతుంది.

అయితే వారికి మ‌న‌సుంద‌ని మ‌న‌కంటే అది గొప్పద‌ని నిరూపించారు.

అది మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన మాయ, చోటు  దంపతులు విష‌యంలో వారి గొప్పత‌నం బ‌య‌ట‌ప‌డింది.

బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా వారి పుట్టినిల్లైన‌ భోపాల్ కు గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు.

వారి రైలు రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ ప్రాంతంలోకి రాగానే గర్భవతి అయినటువంటి మాయకు ఒక్కసారిగా పురిటినొప్పులు అధిక‌మ‌య్యాయి.డాక్టర్ ఇచ్చిన డేట్ ఇంకా ఉండ‌గానే ఊహించ‌ని విధంగా నొప్పులు రావ‌డంతో ఆదంప‌తులకు,అక్కడున్న  ప్రయాణికులకు ఏం చేయాలో అర్ధం కాలేదు.

అదే స‌మ‌యంలో అక్కడే అదే భోగీలో ఉన్న  వరంగల్ కు చెందిన హిజ్రాలైన నిహారిక, జాస్మిన్, లూసియాలు మాయ ప‌డుతోన్న పురిటినొప్పులను  చూసి చ‌లించి పోయారు.ఆ వెంటనే అదే బోగీలో ఉన్నటువంటి బాత్ రూమ్లోకి మాయ‌ను  తీసుకువెళ్ళి ప్రసవం జరిపించారు. ఈ సంద‌ర్బంగా…..  మాయ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.అదే స‌మ‌యంలో  అధికారులకు వియజ్ఞం తెలియ‌డంతో  రైలును ఆలేరులో ఆపివేశారు. అక్కడి నుంచి మాయ‌,చోటు దంప‌తుల‌తో పాటు హిజ్రాలు ఆమెతో 108 వాహనం ద్వారా  ఆలేరు లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళారు. సరైన సమయంలో పురుడు పోయడంతో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాలను వైద్యులతో పాటు మాయ కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులు అభినందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -