Thursday, March 28, 2024
- Advertisement -

కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్

- Advertisement -

దేశంలో క‌రోనా మ‌హమ్మారి పంజా విసురుతోంది. ప్ర‌స్తుతం రాకెట్ స్పీడ్ తో వైర‌స్ విజృంభిస్తోంది. దీంతో దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డం మొద‌లుపెట్టిన‌ప్పటి నుంచి ఎప్పుడు లేని విధంగా తాజాగా ఒకే రోజులో ల‌క్ష కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ స్థాయిలో క‌రోనా కేసులు వెలుగుచూస్తుండ‌టంతో ఆధికారుల‌తో పాటు ప్ర‌జ‌లు సైతం భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వివ‌రాలు ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా సోకింది. ఈ స్థాయిలో దేశంలో ఒకే రోజులో క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా, మ‌ర‌ణాలు సైతం దేశంలో గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. కొత్త‌గా 478 మంది వైర‌స్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,65,101 పెరిగింది. దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే న‌మోద‌వుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అధికారులు వేగ‌వంతం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

క్రికె‌ట్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. షెడ్యూల్ ‌ ప్రకారమే ఐపీఎల్ !

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -