Thursday, April 25, 2024
- Advertisement -

క్రికె‌ట్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. షెడ్యూల్ ‌ ప్రకారమే ఐపీఎల్ !

- Advertisement -

దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా కొట్లాది మంది క్రికెట్ అభిమానులు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. క్రికెట్ ప్రియుల‌ను ఎంత‌గానో అల‌రించే ఈ టోర్నీలో అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్లు పాల్గొంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, దేశంలో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్రేక్ష‌కులు లేకుండానే గ‌తేడాది దుబాయ్ లో ఐపీఎల్ ను నిర్వ‌హించారు.

ఈ ఏడాది భార‌త్ లోనే నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తుండ‌టంతో ఐపీఎల్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ 14వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుంద‌ని వెల్ల‌డించాడు. ఐపీఎల్ 2021- 14వ సీజన్‌లో భాగంగా ఈ నెల (ఏప్రిల్‌) 10 నుంచి 25 తేదీల మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ సీజ‌న్ మొద‌టి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లు ముంబయిలోనే స్టే చేస్తున్నాయి. అయితే, మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్‌, ఆ త‌ర్వాత నైట్ క‌ర్ఫ్యూ విధించింది. దీంతో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు వ్య‌క్తమ‌య్యాయి.

‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -