Saturday, April 20, 2024
- Advertisement -

గురక రాకుండా.. మూడు చిట్కాలు

- Advertisement -

మ‌నిషికి ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. మ‌నిషి ఎంత ప్ర‌శాంతంగా నిద్ర‌పోతే అన్ని ఎక్కువ రోజులు జీవిస్తాడు.

అలాంటి విలువైన నిద్రకు భంగం కలిగిస్తుంటుంది గుర‌క‌. గుర‌క వ‌ల్ల చాలామందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు. ఇది గురక పెట్టేవారికన్నా ఎక్కువ.. పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంది. ఇలా నిద్రకు భంగం కలిగించే గురకని తగ్గించుకోడానికి 3 అద్భుతమైన విధానాలు ఉన్నాయి. కేవలం నాలుకతో చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేసి గురకను తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూదాం…!!

ది స్లయిడ్: గురక పెట్టేవారు తమ నాలుక టిప్ ని నోట్లిని పై భాగానికి ఆనిస్తూ ఉండాలి. ఇలానేమ్మదిగా నాలుకను వెనక్కి నెడుతూ ఉండాలి. 10 నుంచి 15 సెకండ్స్ ఇలా చేసి కొన్ని క్షణాల గ్యాప్ ఇచ్చి అలా మరల మరలా తరచుగా చేస్తూ వుండాలి.

ది ప్రెస్: ఈ విధానంలో పూర్తి నాలుకను పై భాగానికి ఆనించి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధానం రోజులో ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు చేయండి. ప్రతి సారి కొన్ని నిమిషాల వరకు చేయండి.

ది రోల్: నాలుక టిప్ ని కంది మునుపటి పళ్లకు ఆనించి నాలుక వెనక భాగాన్ని నోటి పై భాగానికి మరియు కొండనాలుకకు తగిలేలా చేయాలి. ఇలా చేస్తూ ఇంగ్లీష్ లోని ‘A’ అనే అక్షరాన్ని పలకాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -